తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలే టార్గెట్​గా డ్రగ్స్ దందా - స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా యువత - girls TARGETED BY DRUG GANGS - GIRLS TARGETED BY DRUG GANGS

Drug Gangs Recruit Women Carriers : విద్యాలయాలు, పని చేసే సంస్థలు, విందు, వినోదాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మత్తు పదార్థాలు చేతులు మారుతున్నాయి. మిత్రుల ప్రభావం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు మత్తుకు అలవాటైన అమ్మాయిలను స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకొని సరకును సురక్షితంగా గమ్యానికి చేరవేసేందుకు ఏజెంట్లుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటు నేపథ్యంలో మత్తు దందాపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

drug gangs
drug gangs (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 11:10 AM IST

Girls being Recruited and Abused by Drug Gangs : మిత్రుల ప్రభావం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు మత్తుకు అలవాటైన అమ్మాయిలను స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకొని సరకును సురక్షితంగా గమ్యానికి చేరవేసేందుకు, స్మగ్లర్లు అమ్మాయిలను ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం, ఉచితంగా మత్తును ఆస్వాదించవచ్చని ఆశ చూపి, యువతుల జీవితాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో మత్తు దందాపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

విద్యాలయాలు, పని చేసే సంస్థల్లో, విందు వినోదాలు, సామాజిక మాధ్యమాల్లో మత్తు పదార్థాలు చేతులు మారుతున్నాయి. నైజీరియన్‌ ముఠాలతో పాటుగా అంతర్​ రాష్ట్ర స్మగ్లర్లపై పోలీసుల నిఘా ఉండడంతో, వారి నుంచి తప్పించుకునేందుకు అప్పటికే మాదకద్రవ్యాలకు అలవాటుపడిన అమ్మాయిలను రంగంలోకి దించుతున్నారు. ఉచితంగా డ్రగ్స్, ఖర్చులకు డబ్బు సమకూరడంతో ఉద్యోగం చేస్తున్న కొందరు మహిళలు తప్పటడుగు వేస్తున్నారని ఓ పోలీసు అధికారి ఆవేదన వెలిబుచ్చారు.

Girls who have Become Drug Addicts : మిత్రులతో కలసి సరదాగా గడిపేందుకు గోవా, ముంబయి, బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ నైజీరియన్లు, స్థానిక ముఠాల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. వాటిని మహిళల బ్యాగులు, లోదుస్తుల్లో ఉంచి, ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో ప్రయాణిస్తూ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకుంటున్నారు. నగరం చేరాక మహిళలతో కొనుగోలుదారులకు సరకు చేరవేస్తున్నారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన మహిళలను పోలీసులు ప్రశ్నించినపుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతులు మైకంలో ఉన్నపుడు నగ్నంగా మార్చి తీసిన వీడియోలతో పాటుగా, ఫొటోలు చూపి వారిని భయపెట్టడం ద్వారా మాదకద్రవ్యాల సరఫరాకు వినియోగించుకుంటున్నారని తెలిసింది. ఈ మేరకు తనకు జరిగిన ఘటనపై ఓ యువతి పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. జిమ్‌లో పరిచయమైన కోచ్‌ ప్రొటీన్‌ పౌడర్‌ అంటూ తనకు ఎండీఎంఏ అలవాటు చేశాడని వాపోయినట్లు తెలిపింది.

  • నెల్లూరు జిల్లా యువతి ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఐటీ ఉద్యోగం రావడంతో నగరం చేరింది. తోటి మిత్రుల ప్రభావంతో నెమ్మదిగా మాదకద్రవ్యాలకు అలవాటైంది. మెుదట్లో వారానికోసారిగా మెుదలై, తాజాగా ఆ కిక్కు లేకుండా ఉండలేని స్థితికి చేరింది. అందులో భాగంగా కొద్దిరోజుల క్రితం దూల్‌పేట్‌లో గంజాయి కొనేందుకు వెళ్లి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడింది. ఆయువతిని పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తే స్నేహితుల కోసం సరకు తీసుకెళ్లేందుకు వచ్చానంటూ అసలు విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెబితే తమ కూతురు అమాయకురాలంటూ ఆ యువతి తల్లిదండ్రులు వాదించారు. చివరకు వైద్య పరీక్షలో రుజువు కావడంతో విలవిలలాడారు.
  • ముషీరాబాద్‌కు చెందిన మహిళ ఒత్తిడి నుంచి బయటపడేందుకు మెుదట్లో నిద్రమాత్రలు తీసుకున్నాను. ఇన్‌స్టాగ్రాములో పరిచయమైన స్నేహితుడి సూచనతో మరింత కిక్కు కోసం ఎల్‌ఎస్‌డీబ్లాట్స్‌కు దగ్గరైంది. మెల్లమెల్లగా ఇద్దరూ కలసి ముంబయి, గోవా, బెంగళూరు వెళ్లి రావడం ప్రారంభించారు. ఆమె అలవాటును అవకాశంగా తీసుకున్న అతడు, ఆమెను డ్రగ్స్‌ సరఫరాకు అనువుగా మలచుకున్నాడు. నగరంలో 50 మందికిపైగా ఇతడి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన టీజీన్యాబ్‌ పోలీసులు నిఘా ఉంచి వారిద్దరిని అరెస్టు చేశారు.
  • గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ఆమె పబ్‌లకు వెళ్లిన సమయంలో డ్రగ్స్‌కు అలవాటైంది. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడి ప్రోత్సాహంతో డ్రగ్స్‌ చేరవేస్తూ టీజీన్యాబ్‌కు పట్టుబడింది. కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమెను మార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇటీవల ఆమెకు చేసిన వైద్యపరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు సమాచారం. నార్సింగి ప్రాంతంలోని మ్యూజిక్‌ టీచర్‌ డ్రగ్స్‌ తీసుకునేది. ఆమె స్నేహితుడు దీన్ని ఆసరా చేసుకొని ఏజెంట్‌గా మార్చాడు. పోలీసుల గణాంకాల ప్రకారం నగరంలో గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ వాడుతున్న ప్రతి 100 మందిలో 40 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబీలకు దూరంగా ఉంటున్న మహిళలే అధికంగా మత్తు ముఠాల బారినపడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.

హైదరాబాద్​లో డ్రగ్స్​పై కట్టుదిట్టమైన చర్యలు - పాజిటివ్​ అని తేలితే జైలుకే - Antinarcotics Police Clarity Drugs

'సరదా కోసం మొదలెట్టి - సరఫరా చేయాల్సిన స్థితికి' - మత్తు ముఠాల ఉచ్చులో చిక్కుకుంటున్న మహిళలు - Women Use Drugs in Hyderabad

ABOUT THE AUTHOR

...view details