తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా నదిలో గంటగంటకూ పెరుగుతున్న వరద - బిక్కుబిక్కుమంటున్న 'దివిసీమ' - flood flow of Krishna river - FLOOD FLOW OF KRISHNA RIVER

Diviseema Flood Problems : గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ఏపీలోని దివిసీమ ప్రజలు వణికిపోతున్నారు. కరకట్ట దిగువన ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే అందర్నీ అప్రమత్తం చేసిన అధికారులు ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Diviseema Flood Threat Looms in AP
Diviseema Flood Problems (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 9:15 AM IST

Diviseema Flood Threat Looms in AP : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం, కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ఏపీలోని దివిసీమ ప్రజలను వణికిస్తున్నాయి. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతంలో వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, పంటలు నీట మునిగేవి. ఇప్పుడు మళ్లీ ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కునుకులేకుండా చేస్తోంది.

ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు : పులిగడ్డ అక్విడక్ట్ వద్ద ఇప్పటికే 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కె.కొత్తపాలెం, దక్షిణ చిరువోల్లంక, పాతఎడ్లంక, పులిగడ్డ, అముదార్లంక, అవనిగడ్డలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Heavy Rains in AP :మోపిదేవి మండలం, ఉత్తర చిరువ్లోల్లంక వద్ద లాకులు నుంచి వరద నీరు కరకట్ట లోపలికి వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలో నాటు పడవలు వినియోగించొద్దని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. మరోవైపు ముంపు బాధితులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగితే లంకల్లో సాగు చేసిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

"వరద పెరగడంతో భయం వేస్తోంది. నిద్ర లేని రాత్రులను గడుపుతున్నాం. పంటలు మునిగిపోతాయని భయంగా ఉంది. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తున్నాం. పంట చేతికి రావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాం." - రైతులు

అమావాస్య పోటు వల్ల సముద్రంలో నిదానంగా కలుస్తున్న వరద నీరు : మరోవైపు కృష్ణానది కరకట్టపై లాకులు ఉన్న చోట ఇబ్బంది ఉన్న ప్రాంతంలో ఇసుక బస్తాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అమావాస్య పోటు వల్ల సముద్రంలో వరద నీరు నిదానంగా కలుస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విపత్తుల్ని దృష్టిలోఉంచుకుని దివిసీమ ప్రజలు అధికారులకు సహకరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్దప్రసాద్ తెలిపారు. త్వరగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన కోరారు.

ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సం - వరదలో చిక్కుకుపోయిన 9మంది, రంగంలోకి హెలికాప్టర్లు - Munneru Vagu Heavy Flood

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం - ఒక్కరోజులోనే ఎంత వర్షపాతమో తెలుసా? - record rainfall in krishna district

ABOUT THE AUTHOR

...view details