Conflict Beween Software Wife and Husband : సాధారణంగా భార్యభర్తల మధ్య వివాదాలు సహజం. వారిలో ఎవరో ఒకరు ఈ గొడవల వల్ల లాభం ఏమి ఉండదని భావించి మళ్లీ ఇలాంటివి దగ్గరకు రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా విషయంలోనైనా వివాదం తలెత్తితే కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపుతారు. కానీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసం ఉంటున్న దంపతులు మాత్రం ఏకంగా ప్రాణాలు తీసుకుని వారి ఇద్దరు పిల్లల్నీ అనాథలుగా మార్చిన ఘటన అందరినీ కలచివేస్తుంది.
అమీన్పూర్ పోలీసుల కథనం ప్రకారం : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బంధంకొమ్ము అనే ప్రాంతంలో నివాసం ఉండే సందీప్, కీర్తి అనే దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు గతంలో అద్దెకు మియాపూర్ ప్రాంతంలో ఉండేవారు. 9 నెలల క్రితం సొంతిల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. వీరికి గగనహిత(3), సాకేత్ (1) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి.