తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ శివారు ప్రాంతాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా - చోరీల్లో తల్లిదండ్రులే పిల్లలకు గురువులు! - Dhar Gang Robbery in Hyderabad

Dhar Gang Thefts in Hyderabad : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో వరుసచోరీలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో పెరిగిన చోరీలపై పోలీసులు ఆరాతీయగా అంతర్రాష్ట్ర ముఠాలే పనేనని గుర్తించారు. దొంగతనం జరిగిన చోట లభించిన ఆధారాలను బట్టి మధ్యప్రదేశ్‌కు ధార్ జిల్లా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు చోరీలు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పని పూర్తిచేసిన తర్వాత తప్పించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని గుర్తించారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Dhar Gang Thefts in Hyderabad
Dhar Gang Robbery in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 7:37 PM IST

హైదరాబాద్ శివారు ప్రాంతాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా - చోరీల్లో తల్లిదండ్రులే పిల్లలకు గురువులు! (ETV Bharat)

Dhar Gang Robbery in Hyderabad : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా అటవీప్రాంతాల్లో, నివసించే గిరిజనులకు వేటనే ప్రధానవృత్తిగా ఉండేది. ప్రత్యర్థులని ఎదిరించేందుకు, తప్పించుకునేందుకు ఎంతకైనా తెగించే ఆ గిరిజనులు చోరీలు, దోపిడీలు చేసేందుకు తమ పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ ముఠాలే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విల్లాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.

రాచకొండ, సైబరాబాద్ పరిధిలో దొరికిన చిన్నపాటి ఆధారాలతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల పోలీసులను సంప్రదించి వివరాలు సేకరించగా, అసలు విషయం బయటపడింది. మధ్యప్రదేశ్ నుంచి రైళ్లలో కుటుంబ సభ్యులతో ముఠాలుగా వచ్చి శివారు ప్రాంతాల్లో పలుచోట్ల గుడిసెలు వేసుకొని నివసిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారులు, మహిళలు బిక్షాటనతోపాటు చిన్నపాటి వస్తువులు విక్రయిస్తుంటే, పురుషులు సిమెంట్ పరిశ్రమలు, కర్మాగారాల్లో రోజువారీ కూలీలుగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నట్లు తేల్చారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలను వణికిస్తున్న దొంగల ముఠాలు :వారాంతంలో చోరీలకు బయల్దేరతారన్న పోలీసులు ముందుగా తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారని చెప్పారు. తాళం వేయని ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట తలుపులు మూసివేస్తారన్న పోలీసులు, చోరీ చేసేప్పుడు ఎవరైనా ఎదురుతిరిగితే చంపేందుకు వెనుకాడరన్న విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన సొత్తును కుటుంబసభ్యులు, చిన్నపిల్లల ద్వారా స్వస్థలాలకు పంపుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. చోరీలకు బయల్దేరే ముందు ఆ ముఠా సభ్యులు ఫోన్లను వెంట తీసుకొనిరారు. ఎంచుకున్న నగరానికి చేరగానే నకీలీ వివరాలతో తక్కువధరలో కొత్త ఫోన్, సిమ్‌కార్డు కొనుగోలుచేస్తారని పోలీసులు గుర్తించారు.

ఎంచుకొన్న ప్రాంతంలో చోరీ పూర్తికాగానే వాటిని మురుగు కాల్వల్లో పారేస్తారు. ధార్‌ముఠాలని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. వారు నివసించే ఆటవీప్రాంతానికి వెళ్లడానికి పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వారు ఉంటున్న ప్రాంతానికి పోలీసులు రాగానే, ఈలవేసి సంకేతం పంపి అప్రమత్తమవుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ ముఠాలను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Uppal Robbery Case :మరోవైపు నగరంలోని ఉప్పల్​ చిలకానగర్​లో గురువారం అంతర్రాష్ట్ర దొంగల ముఠా దోపిడీకి యత్నించింది. స్థానికంగా నివాసం ఉంటున్న పిట్టల సుదర్శన్ (66) అనే బట్టల వ్యాపారి ఇంటి వద్దకు, ఇద్దరు వ్యక్తులు వెళ్లి తన అంతస్తులో పోర్షన్ ఖాళీగా ఉన్న అద్దె బోర్డు గురించి అడిగారు. అయితే సుదర్శన్ అద్దెకి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అక్కడే ఉన్న నిందితులు సుదర్శన్​పై దాడి చేసి, అతని నోటిలో కర్చీఫ్ పెట్టి అతని ముఖంపై చేతులతో కొట్టారు.

స్ప్రే కొట్టే సమయానికి అతను గట్టిగా అరిచాడు. పక్కన ఉన్న అద్దెదారులు వచ్చి అతన్ని రక్షించారు. ఇరుగుపొరుగు వారు వచ్చి నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు వచ్చింది దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. అయితే శివారు ప్రాంతంలో సంచరిస్తున్న ధార్ ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దశలో విచారిస్తున్నారు.

జల్సాలకు అలవాటు పడి చోరీలు - జైలుకెళ్లినా మార్పు రాలె - police arrested Theft Gang

పట్టపగలే దొంగల బీభత్సం- రూ.7లక్షలు లూటీ- సినీ ఫక్కీలో ఫ్యామిలీ కిడ్నాప్​ - Robbery In Dehradun

ABOUT THE AUTHOR

...view details