DGP Ravi Gupta on Medaram Jatara :మేడారం మహా జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అన్నారు. ఈ మహా జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్న ఆయన, భక్తుల రద్దీనీ(Devotees Crowd) దృష్టిలో ఉంచుకొని పది వేలకు పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ట్రాఫిక్, నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నేడు జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొంగులేటి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహా జాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. ఆభరణాలు(Jewellery) వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. లక్షలాదిమంది తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Plastic Free Medaram Jatara :మరోవైపుప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు, ప్రజలు సహకరించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ ఛైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి కోరారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన, సేవ్ మేడారం(Save Medaram) క్లీన్ మేడారం- మేడారం సే నోటు ప్లాస్టిక్ గోడపత్రిక, పర్యావరణ గుడ్డ సంచులను హైదర్ గూడలో విడుదల చేశారు. రెండు కోట్ల మంది మేడారం మహా జాతరకు తరలి వస్తారని, భక్తులందరూ మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవవైవిద్యాన్ని జీవులను వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.