9 Crore Compensation To Woman Family In AP : బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి రూ.9కోట్లు పరిహారం ఇవ్వాలని ఏపీఎస్‌ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.
అసలేం జరిగిందంటే : లక్ష్మి అనే మహిళ 2009 జూన్ 13న ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తున్నారు. ఆ క్రమంలో వారికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటర్ యాక్సిడెంట్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
సుప్రీంకోర్టు తీర్పు : వాదోపవాదాలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించగా, రూ5.75 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా రూ.9,64,52,220 పరిహారం చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
'ఇప్పటికే 10 నెలలు పూర్తయింది - ఇంకెంత గడువు కావాలి?'
'ఇకపై దివ్యాంగులందరూ స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చు'- సుప్రీం కోర్టు కీలక తీర్పు