Deputy CM Bhatti Vikramarka Launch Solar Power Panel : రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికిఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలో జున్నా సోలార్ పవర్(Solar Power) ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు.
'వేసవిపై దృష్టిసారించండి, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను పెంచాలి'
స్ట్రింగర్ మిషన్ యూనిట్, వాటి ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్, భస్సింగ్, లే అప్, లామినేటింగ్ ఫ్రేమింగ్(Laminating Framing), క్యూరింగ్ లైన్, క్లీనింగ్ సెక్షన్, సన్ సిమ్ లెటర్, ఐ పోర్టు, ఫైనల్ ఈఎల్ ప్రాసెస్ యూనిట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. 2030 సంవత్సరం నాటికి ప్రజలకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిని చేస్తామన్నారు.
Bhatti Vikramarka on Alternate Power Generation : ప్రపంచంలో మానవ జాతికి, విద్యుత్ శక్తికి మధ్యన విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్ శక్తి అవసరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో, ఆ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రణాళిక బద్ధంగాసౌర శక్తి, పవన శక్తి, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకుంటూ వస్తోందని వివరించారు.