తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టొద్దు : భట్టి విక్రమార్క - Deputy CM Bhatti On Sand Auction

Deputy CM Bhatti On Revenue sources : పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమలను పరిరక్షించాలని హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఇసుక తవ్వకాలు, రవాణాలో అక్రమాలను నిరోధించాలని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Deputy CM Bhatti On Revenue sources
Duputy CM Bhatti On Sand Auction

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 10:02 AM IST

Updated : Mar 16, 2024, 10:20 AM IST

ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకునేలా చర్యలు చేపట్టాలి : భట్టి విక్రమార్క

Deputy CM Bhatti On Revenue sources: ఆదాయ వనరుల సమీకరణ, నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ప్రతీవారం సమీక్షా సమావేశం నిర్వహించాలని అధికారులకు తెలిపారు. హైదరాబాద్​తో పాటు పరిసరాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.

బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ

Telangana Govt Decision To Take Up Sale Of Sand In Open Auction: ఇసుక ద్వారా ఆదాయం పెంచుకోవడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్న ప్రచారాన్ని విశ్లేషించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక బహిరంగవేలం (Sand Auction) నిర్వహించాలన్న భట్టి, ఇసుక కోసం ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ మార్కెట్ యార్డులలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో గృహ నిర్మాణం తదితర రంగాల్లో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని తెలిపారు.

Deputy CM Bhatti On Revenue sources : హెచ్ఎండీఏ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పర్యాటకం, ఇతర రంగాల్లోని లీజులను సమీక్షించి ఛార్జీలు పెంచేందుకు కసరత్తు చేయాలని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు పరిసరాలను ఉపయోగించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్న ఉపముఖ్య మంత్రి స్థిరాస్తి రంగం ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు. నాన్ డ్యూటీ లిక్కర్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

కల్తీ మద్యం నివారణకు ప్రత్యేక హోలోగ్రామ్స్​తో కూడిన వ్యవస్థ, సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెంచడం వంటి అంశాలపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. సామాన్య ప్రజలు మట్టి తరలిస్తున్న క్రమంలో పోలీసులు, మైనింగ్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి, మాంగనీసు, ఇతర ఖనిజాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

ఒకే బిల్లుపై మూడురెట్ల అధిక లోడుతో గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్నారని దాని వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, ఈ పరిస్థితిని నియంత్రించాలని మైనింగ్ శాఖ అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ప్రతి రీచ్‌లో సీసీ కెమెరాలు, ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్​తో పాటు, వాహనాల ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయాలన్నారు. ఎలక్ట్రిల్ వాహనాలపై ఇప్పుడే పనులు విధించే ఆలోచన విరమించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు.

రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్‌ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన

సూర్యాపేటలో రూ.53 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన - పాల్గొన్న భట్టి, ఉత్తమ్

Last Updated : Mar 16, 2024, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details