తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు పాఠశాలల్లో మరాఠీ పంతుళ్లు - పాఠాలు అర్థంగాక విద్యార్థుల తిప్పలు - MARATHI TEACHERS IN TELUGU SCHOOLS - MARATHI TEACHERS IN TELUGU SCHOOLS

Marathi Teachers in Telugu Schools in Kamareddy : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని 'తెలంగాణ-మహారాష్ట్ర' సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా మరాఠీ, తక్కువగా తెలుగు మాట్లాడుతారు అక్కడి ప్రజలు. ఆ గ్రామాల్లో గతంలో మరాఠీ మీడియం బడులే ఉండేవి. కొన్నేళ్ల కింద వాటిని తెలుగు మాధ్యమ పాఠశాలలుగా మార్చారు. తెలుగు మీడియం పుస్తకాలే ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను మాత్రం మార్చకపోవడంతో బోధించే విద్య అర్థంకాక, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Marathi Medium Schools in Kamareddy
Marathi Medium Schools in Kamareddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 8:57 AM IST

Updated : Jul 8, 2024, 9:02 AM IST

Student Demand for Marathi Medium in Kamareddy : తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు అవి, ఎక్కువగా మరాఠీ, తక్కువగా తెలుగు మాట్లాడుతారు. ఆ గ్రామాల్లో గతంలో మరాఠీ మీడియం పాఠశాలలే ఉండేవి. అయితే కొన్నేళ్ల కింద వాటిని తెలుగు మీడియం పాఠశాలగా మార్చారు. తెలుగు మీడియం పుస్తకాలు సైతం విద్యార్థులకు ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను మాత్రం మార్చలేదు. మరాఠీ ఉపాధ్యాయులు, తెలుగు నేర్చుకునే విద్యార్థులు అన్నట్టుగా మారిపోయింది. ఉపాధ్యాయులకు తెలుగు రాక మరాఠీలోనే విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులే పుస్తకాల్లో చూసి తెలుగు నేర్చుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల విద్యా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఆ పాఠశాలల్లో సంఖ్య సైతం పూర్తిగా పడిపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు, మద్నూర్‌ మండలం తడిహిప్పర్గ, హండె ఖేలూర్‌, చిన్న శక్కర్గ గ్రామాలు. ఇక్కడ అందరూ మరాఠీ మాట్లాడతారు. తెలుగు చాలా తక్కువగా మాట్లాడుతారు. మాట్లాడే భాష మారాఠీ కాబట్టి ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లోనూ మరాఠీలోనే విద్యాబోధన సాగుతూ ఉండేది. పిల్లలు సైతం మరాఠీ మీడియంలోనే చదివేవారు. అయితే 2019లో ఈ పాఠశాలలను తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చేశారు. దీంతో అప్పటి నుంచి తెలుగు మీడియం పుస్తకాలు అందిస్తున్నారు. కానీ మరాఠీ ఉపాధ్యాయులను మార్చి తెలుగు టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం మర్చిపోయారు. దీంతో మరాఠీ ఉపాధ్యాయులు ఉండగా తెలుగు మీడియం విద్యాబోధన సాధ్యం కావడం లేదు. ఉపాధ్యాయులు మరాఠీలోనే బోధిస్తుంటే విద్యార్థులు మాత్రం పుస్తకాలు చూస్తూ తెలుగు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

గురుభక్తి అంటే ఇదేనేమో - బదిలీ అయిన టీచర్ - ఆయన వెళ్లిన బడిలోనే చేరిన విద్యార్థులు - STUDENTS TRANSFERRED WITH TEACHER

మద్నూర్‌ మండలం తడిహిప్పర్గ, హండె ఖేలూర్‌, చిన్న శక్కర్గ గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఏడు వరకు విద్యాబోధన సాగుతోంది. మూడు పాఠశాలల్లో అప్పట్లో ఒక్కో పాఠశాలలో వందకు పైగా విద్యార్థులు ఉండే వారు. ఇప్పుడు మాత్రం మూడు పాఠశాల్లలో కలిపి వంద మంది ఉన్నారు. మిగతా అందరూ భాష పరంగా తలెత్తిన సమస్య కారణంగా ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లిపోయారు. తడిహిప్పర్గ పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉండగా ఉన్న ఒక ఉపాధ్యాయుడు మరాఠీలో పాఠాలు బోధిస్తున్నారు. హండె ఖేలూర్‌ లో వంది మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరాఠీలో బోధన సాగుతోంది.

చిన్న శక్కర్గలో 14 మంది విద్యార్థులు ఉండగా, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన సైతం మరాఠీలోనే బోధన చేస్తున్నారు. గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులు చివరకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరాఠీ ఉపాధ్యాయుల స్థానంలో తెలుగు బోధించే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే పాఠశాలలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'ఎక్కడికీ వెళ్లొద్దు మేడం - ఇక్కడే ఉండండి' - టీచర్ల​ బదిలీ - విద్యార్థుల కంటతడి - Students Cried For Teacher Transfer

Last Updated : Jul 8, 2024, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details