Delhi Police Summons to Congress Leaders on Amit Shah Fake Video :రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మే 1వ తేదీనా దిలిలీ ద్వారకా సెక్టార్‌లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌ఛార్జి రామచంద్రారెడ్డికి కేసుకు సంబంధించిన పేపర్లను నీరజ్ చౌధరీ అందజేశారు. నో
అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో నలుగురికి నోటీసులు :టీసులు అందుకున్నవారు మే 1వ తేదీనా విచారణకు హాజరుకాని పక్షంలో సీఆర్‌పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో వివరించారు. దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు.
Amit Shah Morphing Video Case : అమిత్‌షాపై సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోను, పోస్ట్ చేసినందకు వినియోగించిన ల్యాప్‌టాప్/సెల్‌ఫోన్/ట్యాబ్‌లను, అలాగే ఈ వీడియోలను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే టైమ్‌లో వెంట తీసుకురావలని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ మన్నె సతీశ్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇచ్చారు. సీఆర్పీసీ 91, 160 కింద నోటీసులు ఇచ్చిన దిల్లీ పోలీసులు, అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అసలేం జరిగిందంటే : అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.