Beware of APK Files : సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైళ్ల రూపంలో టెలిగ్రామ్‌ల, వాట్సాప్ ద్వారా సెల్‌ఫోన్‌లోకి చొరబడుతున్నారు. లింక్‌ను తెలిసి, తెలియక క్లిక్ చేస్తే ఫోన్‌లోని సమాచారమంతా సైబర్ మోసగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఆ ఫోన్ నంబరుకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాలోని నగదును పూర్తిగా ఊడ్చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు మొబైల్ ఫోన్ వాడకంపై అవగాహన లేని వారే ఎక్కువ మంది బలైపోతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య అన్ని బ్యాంకులు పూర్తిగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నాయి. దీనికి 2022లోనే ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి గుర్తింపు లభించింది. దీనంతటికి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడమే కారణం. ఈ మధ్యలో ప్రజల చేతిలో నగదు కనబడటం చాలా వరకు తగ్గింది.
దీంతో దొంగలు నగదు దోచుకోవడానికి కొత్త అవతారం ఎత్తారు. ఆధునిక సాంకేతికతను అడ్డం పెట్టుకుని మోసాలకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గ్రామం, మండలం, జిల్లా ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు విస్తరించాయి. ఈ మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తి వేగంగా విస్తారంగా జరుగుతోంది.
రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!
సోషల్ మీడియాలో బ్యాంకు ఆధార్ లింక్, ఖాతా అప్‌గ్రేడ్ కోసమని ప్రభుత్వ పథకాల్లో వివరాలు, ఉచిత ఓటీటీలు, పలు రకాల సేవలు అంటూ గ్రూపులో ఉన్న సభ్యులను నమ్మించేలాగా నిజమైన అధికార చిహ్నాలతో ఏపీకే ఫైళ్లు పంపిస్తున్నారు. బ్యాంకు వంటివి అయితే ఇది ఎమర్జెన్సీ అని, డౌన్‌లోడ్ చేసుకోవాలని ఫోన్ చేసి మరీ వల వేస్తున్నారు.
ఆలోచించకుండా ఏపికే ఫైళ్లపై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే ఇక ఆ ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మొబైల్ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, ఇతరుల నంబర్లు, మెస్సేజ్‌లు వంటివి అవతలి వ్యక్తులకు సులభంగా చేరుతాయి. దీంతో సొంత ఖాతాదారులకు తెలియకుండానే నగదును తమ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఒక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులోకి చేరాక అందులోని వివిధ రకాల సభ్యుల నంబర్ల ఆధారంగా వేర్వేరు గ్రూపులకు వెళ్తుంటారు.
ఫిర్యాదుల వెల్లువ : కోనరావుపేటకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆశాకార్యకర్త, మంగళ్లపల్లికి చెందిన రైతుకు నాలుగు రోజుల క్రితం ప్రధాన్‌మంత్రి కిసాన్ పేరుతో ఏపీకే ఫైల్ వచ్చింది. దీనిపై క్లిక్ చేస్తే మీరు పథకానికి అర్హులు అవుతారు. అలాగే నగదు కూడా వస్తుందని ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో వారి ముగ్గురి బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. లక్షా 54 వేలు బదిలీ అయ్యాయి. గత మూడేళ్లుగా జిల్లావ్యాప్తంగా ఇలాంటి వాటిపై ఎన్‌సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులల్లో ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు చూస్తే తక్కువ మొత్తంలో ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు అవసరం
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లపై అస్సలు క్లిక్ చేయవద్దు.
- ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్(తెలియని వారి నుంచి) అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు.
- మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నంబర్లను యాక్సెస్ చేసే అనుమతిని ఇవ్వొద్దు.
- తెలియని ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగి ఉంటే ఆ చరవాణిని రీసెట్ చేయాలి. దీని వల్ల మునుపటి స్థితికి మొబైల్ ఫోన్ వస్తుంది.
ఆన్లైన్లో లోన్ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?