ETV Bharat / sports

'సచిన్ సలహా పట్టించుకోని పృథ్వీ షా!' - PRITHVI SHAH SACHIN TENDULKAR

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిగిలిపోయిన పృథ్వీ షాపై కీలక కామెంట్స్​ చేసిన బీసీసీఐ మాజీ సెలక్టర్.

Sachin Tendulkar  Prithvi shah
Sachin Tendulkar Prithvi shah (source IANS and Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 27, 2024, 12:43 PM IST

Prithvi shah Sachin Tendulkar : ప్రస్తుతం పృథ్వీ షా కెరీర్​ ఆగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు అరంగేట్ర టెస్టులోనే సెంటరీ బాదిన పృథ్వీ షా కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అంతా ఆశించారు. దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​తోనూ పోల్చారు. అతడు సచిన్ అంతటి ప్లేయర్ అవుతారని పలు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత పలు వివాదాలు, ఫిట్ నెస్ సమస్యలతో టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు పృథ్వీ షా. అలాగే రంజీల్లోనూ ప్లేస్ దక్కలేదు. టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోవడం వల్లే పృథ్వీ షా కెరీర్ ఇలా అయిందన్న వాదనలు కూడా వినిపించాయి.

ఇకపోతే ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గతేడాది వరకు దిల్లీకి ఆడిన పృథ్వీ మెరుగైన ప్రదర్శన చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం బేస్ ధరతో (రూ.75 లక్షలకు) తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఈ క్రమంలోనే పృథ్వీ షా గురించి కీలక కామెంట్స్ చేశారు ఓ బీసీసీఐ సెలక్టర్. పృథ్వీ షా సచిన్​తో సహా ఇతర లెజెండ్ క్రికెటర్ల సలహా, సూచనలను పక్కనపెట్టేశాడని అన్నారు.

పలు సూచనలు చేసిన సచిన్! - నాలుగేళ్ల క్రితం పృథ్వీ షా డోపింగ్‌ టెస్టులో పట్టుబడి 8 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ సమయంలో పృథ్వీ షాతో దిగ్గజ ఆటగాడు సచిన్ మాట్లాడాడట. కెరీర్ గురించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. క్రమ శిక్షణ, స్వీయ నియంత్రణపై యంగ్ క్రికెటర్​కు సచిన్ సలహాలు ఇచ్చాడట. తన స్నేహితుడు వినోద్ కాంబ్లీ కెరీర్ గురించి పృథ్వీ షాతో చర్చించాడని తెలిసింది. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ సెలక్టర్ తెలిపాడు.

"పృథ్వీ షా దిల్లీ క్యాపిటల్స్​కు ఆడిన సమయంలో రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌, అతడితో మాట్లాడారు. సచిన్ తెందూల్కర్ కూడా పృథ్వీ షాతో మాట్లాడి పలు సూచనలు చేశాడనేది ముంబయి క్రికెట్​లో బహిరంగ రహస్యం. పృథ్వీషా క్రికెట్ లెజెండ్స్ ఇచ్చిన సూచనలను పాటించలేదు. అతడిలో ఎటువంటి మార్పు రాలేదు." అని బీసీసీఐ మాజీ సెలక్టర్ వ్యాఖ్యానించాడు.

ఆశ్చర్యంగా ఉంది - ఐపీఎల్ మెగావేలంలో బేస్ ప్రైస్ రూ.75 లక్షలతో బరిలోకి దిగిన పృథ్వీ షాని తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ ఇది ఇబ్బందికర విషమేనని అన్నాడు.

" దిల్లీ క్యాపిటల్స్‌ పృథ్వీ షాకు చాలా మద్దతు ఇచ్చింది. పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడతాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు బాదాడు. అతడి శక్తిపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ అతడు దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్‌, ఫామ్‌ సంపాదిస్తే సర్ఫరాజ్‌ ఖాన్‌లా అవకాశాలను దక్కించుకొనే ఛాన్స్‌ ఉంది" అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

ట్రోలింగ్ పై స్పందించిన పృథ్వీ షా

మరోవైపు, ఐపీఎల్ మెగావేలంలో తనను ఏ ఫ్రాంచైజీ దక్కించుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌ పై పృథ్వీ షా స్పందించాడు. తన కెరీర్‌ ఆసాంతం ట్రోలింగ్‌ జరుగుతూనే ఉందని, తాను కూడా మీమ్స్​ను చూస్తూ ఉంటానని వెల్లడించాడు.

"ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే, నన్ను ఎలా ట్రోల్‌ చేస్తారు. అలా ట్రోల్ చేస్తే అతడి కళ్లన్నీ నాపేనే ఉన్నాయని అర్థం. ట్రోలింగ్‌ అనేది మంచిది కాదు. అలాగని చెడ్డ విషయమూ కాదు. కేవలం క్రికెటర్లే కాకుండా, ఇతర రంగాల వ్యక్తులనూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. నాపై చేసే మీమ్స్ కొన్నిసార్లు బాధపెడుతుంటాయి. ఇప్పుడు నన్ను బయట ఎక్కడైనా చూస్తే నేనేమీ పెద్దగా ప్రాక్టీస్ చేయడం లేదని అనుకుంటారు. నా పుట్టినరోజున కూడా బయటకు వెళ్లకూడదని అనుకుంటారు. నేనేం తప్పు చేశానో కూడా అర్థం కావట్లేదు. ఏం చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారు." అని ఓ వీడియోలో పృథ్వీ షా వ్యాఖ్యానించాడు.

రెండో టెస్ట్​కు గిల్​ దూరం! - ఆసీస్​ టూర్​కు షమీ కూడా డౌటే!

ఐపీఎల్​ 2025 - ఓవర్​నైట్​లో కోటీశ్వరులైన యంగ్ ప్లేయర్స్ వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.