ETV Bharat / state

ఉదయపు హార్ట్​ఎటాక్​ నుంచి రక్షించే 'గోళీలు' - పేటెంట్​ సాధించిన బాపట్ల ఫార్మసీ కళాశాల బృందం - DRUG FORMULA TO HEART ATTACK

గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములాను కనుగొన్న ఏపీలోని బాపట్ల ఫార్మసీ కళాశాల బృందం - వీరి ఫార్ములాకు లభించిన పేటెంట్‌

Drug Formula To Prevent Heart Attack
New Drug Formula To Prevent Heart Attack (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 12:46 PM IST

New Drug Formula To Prevent Heart Attack : మన శరీరంలోని అవయవాలలో గుండె చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న,పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారికి గుండెపోటు వస్తుంది. దీంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లేలోపే చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల విద్యార్థులు అభివృద్ధి చేశారు.

గుండెపోటు రాకుండా కొత్త ఔషధ ఫార్ములాను ఏపీలోని బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి.సాయికిషోర్‌ నేతృత్వంలోని పరిశోధన విద్యార్థులు టి.వాణీ ప్రసన్న,బి.వంశీకృష్ణ, అభివృద్ధి చేశారు. వీరి రూపొందించిన ఫార్ములాకు పేటెంట్‌ లభించింది. గుండెపోటు ఎక్కువగా మార్నింగ్ సమయాల్లోనే వస్తున్నాయని దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని తెలిపారు. రాత్రి, ఉదయం సమయాల్లో గుండెపోటు వస్తే ఆ సమయాల్లో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోవట్లేదు.

Drug Formula To Prevent Heart Attack
New Drug Formula To Prevent Heart Attack (ETV Bharat)

ఈ ప్రతికూలతలను అధిగమించి, కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయికిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీప్రసన్న చాలా పరిశోధనలు చేశారు. నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు.

రాత్రి భోజనం తర్వాత ఈ కాప్స్యూల్‌ వేసుకుంటే : రాత్రి భోజనం తర్వాత 9గంటలకు ఈ కాప్స్యూల్‌ వేసుకుంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి గుండెపోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనలు ద్వారా తెలుసుకున్నారు. కుందేళ్లపై రెండు దశల్లో ఈ ఔషధాన్ని పరీక్షించారు. దీనిపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు.

అంతర్జాతీయ రీసెర్చ్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీలో పరిశోధన పత్రం ప్రచురితమైంది. తమ ఔషధ ఫార్ములాపై పేటెంట్‌ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేశామని, తాజాగా కేంద్ర పేటెంట్‌ సంస్థ పేటెంట్‌ జారీ చేసిందని ఆచార్యుడు సాయికిశోర్‌ ఆనందం వ్యక్తం చేశారు. బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్‌ టీఈ గోపాలకృష్ణమూర్తి పేటెంట్‌ పొందిన విద్యార్థులను అభినందించారు.

'మా పరిధి ఇంతవరకే' - హార్ట్​ పేషెంట్​ను రోడ్డుపై వదిలేసి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్

ఆ అలవాట్లే బ్రెయిన్‌స్ట్రోక్‌, హార్ట్‌ ఎటాక్‌లకు కారణం! - ఇవి పాటిస్తే వాటిని నివారించుకోవచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.