MATRIMONIAL FRAUD IN HYDERABAD :సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.రోజురోజుకు రాష్ట్రంలో సైబర్‌నేరాలు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్‌నేరాల పట్ల పోలీసుశాఖ ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైళ్లు సృష్టించి యువతపై ప్రేమ, పెళ్లి పేరుతో ఆశలు రేపుతున్నారు. నమ్మిన బాధితుల వద్ద నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. స్నాప్‌చాట్‌లో యువతి పేరిట ఖాతా తెరిచి బాధితుడి నుంచి రూ.14 లక్షలు కాజేసిన నేరగాడిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మరం అశోక్ రెడ్డి అనే యువకుడు స్నాప్‌చాట్‌లో ప్రణీత రెడ్డి పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుడికి మెసేజ్ చేశాడు. మెల్లగా చాటింగ్‌లో మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ నమ్మబలికాడు. అర్జెంట్‌గా డబ్బు అవసరం అని చెప్పి వెంటనే పంపించాలని చెప్పి కోరాడు. మరికొంతకాలానికి వ్యాపారం పేరిట బాధితుడి నుంచి డబ్బులు కాజేశాడు. వారు మోసపోయామని బాధితుడికి తెలవనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. తనతో స్నాప్‌చాట్‌లో చాటింగ్ చేస్తున్నది అమ్మాయి కాదని తెలుసుకున్న యువకుడు ఖంగుతిన్నాడు.
మీ మొబైల్‌కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్ చేసేయండి