తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ బాధితులకు ఊరట - కేసుల పరిష్కారంపై ఈనెల 9న మెగా లోక్అదాలత్‌ - సైబర్ సొమ్ముపై మెగా లోక్‌అదాలత్

Cyber Crime Cases in Telangana : సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు ఊరట కలిగించే నిర్ణయమిది. నేరస్థులు కొట్టేసిన డబ్బును స్తంభింపజేసి రోజులు గడుస్తున్నా తిరిగి తమకు చేరలేదనే బాధితులకు ఉపశమనం కలగనుంది. ఇందుకోసం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ప్రామాణిక విధానాన్ని రూపొందించాయి.

Cyber Crime Cases in Telangana
Cyber Crime Cases in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 9:27 AM IST

సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు ఊరట

Cyber Crime Cases in Telangana :సైబర్‌ నేరాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మేంట్ సిస్టమ్ ద్వారా నేరస్థుల లేదా అనుమానితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేందుకు సీఆర్పీసీ 457 సెక్షన్ కింద న్యాయస్థానంలో దరఖాస్తు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ మేరకు ఈనెల 9న జరిగే మెగా లోక్అదాలత్‌లో ఆయా కేసులను పరిష్కరించే దిశగా పోలీస్‌శాఖ కసరత్తు వేగవంతం చేసింది.

Cyber Crimes Mega Lok Adalat : చాలా వరకు సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసినా బినామీ ఖాతాల్లోకి సొమ్ము చేరడంతో నిందితులెవరనేది పోలీసులు సులువుగా గుర్తించలేకపోతున్నారు. అలాంటి ఉదంతాల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. అయితే బాధితుల సొమ్మును సదరు ఖాతాల నుంచి ఉపసంహరించకుండా జప్తు చేయగలుగుతున్నారు. రూ.25,000ల లోపు పోగొట్టుకున్న ఉదంతాల్లో బాధితులకు ఆ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు తాజాగా కసరత్తు చేపట్టారు.

సైబర్ నేరాల్లో తెలుగు యువత - ఇతర రాష్ట్రాల వారితో కలిసి కోట్లు కొల్లగొడుతున్నారు

Cyber Crime in Telangana : ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా 18,000ల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము సుమారు రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాంటి కేసుల దర్యాప్తుల్లో అధికారులంతా సంబంధిత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయా యూనిట్ల ఉన్నతాధికారులకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau) డైరెక్టర్ శిఖా గోయల్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అన్ని యూనిట్లలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.

కాజేసిన సొమ్మును స్తంభింపజేయడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగంగా పనిచేస్తుంది. కానీ సైబర్ నేరస్థుల (Cyber Crimes in Telangana ) బారిన పడి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి దక్కించుకోవడం మాత్రం అంత సులువైన విషయం కాదని తెలిసిందే. ఒకవేళ నేరస్థులను గుర్తించినా అప్పటికే డబ్బును ఖర్చు చేసేస్తుండటంతో బాధితులకు రిక్తహస్తమే మిగులుతోంది. ఇండియన్ సైబర్‌క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు.

బాధితులు 1930కు ఫోన్ చేసినా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించి నేరస్థుల బ్యాంకు ఖాతాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతారు. ఈక్రమంలోనే పెద్ద మొత్తంలో సొమ్మును సైబర్‌ నేరస్థుల చేతికి చిక్కకుండా ఆపగలుగుతున్నారు. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనతికాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే 89,783 ఫిర్యాదులను ఇది పర్యవేక్షించడం గమనార్హం.

98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్

Telangana Police Action on Cyber Crimes :దేశవ్యాప్తంగా నమోదైన ఫిర్యాదుల్లో ఇవి ఏకంగా 8 శాతం కావడం గమనించదగిన విషయం. దేశవ్యాప్తంగా ఎన్‌సీఆర్‌పీకి వచ్చిన ఫిర్యాదుల్లో ఎఫ్ఐఆర్‌ నమోదులో దేశవ్యాప్త సగటు 2.5 శాతంగా ఉంది. కాగా తెలంగాణాలో ఏకంగా 16 శాతం వరకు ఉండటం కీలకంగా మారింది. ఆయా కేసుల్లో టీఎస్‌సీఎస్‌బీ ఏకంగా రూ.133 కోట్లను స్తంభింపజేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే స్తంభింపజేసిన సొమ్ములోనుంచి సుమారు 7.71 కోట్లను తిరిగి బాధితులకు ఇప్పించగలిగింది.

స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల ఆశ చూపి - హైదరాబాద్​కు చెందిన వృద్ధుడికి రూ.5.98 కోట్లు టోకరా

ప్రజల నమ్మకమే సైబర్​ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details