Curtains installed Around Allu Arjun House : ఒకవైపు చిక్కడపల్లిలోని పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్నప్పుడే ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ ముగిసింది. అనంతరం తన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. దీంతో ఆయన ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఏలాంటి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటిపై జేఏసీ సంఘాల దాడి : ఓయూ జేఏసీ నాయకుల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన విషయం అందిరికీ తెలిసిందే. మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు నినాదాలు సైతం చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లను కూడా విసిరేశారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు.