తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ట్వీట్ - స్మితా సభర్వాల్​పై ఫిర్యాదు - SMITA SABHARWAL CONTROVERSY - SMITA SABHARWAL CONTROVERSY

Smita Sabharwal Controversial Tweet Latest Update : ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. వికలాంగులను అగౌరవపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Smita Sabharwal
Smita Sabharwal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 2:21 PM IST

Updated : Jul 22, 2024, 2:34 PM IST

Smita Sabharwal Controversy Latest Update :ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సభర్వాల్​పై కేసు నమోదైంది. వికలాంగులను అగౌరవపరిచి మాట్లాడిన స్మితా సబర్వాల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

మహారాష్ట్రలో మాజీ ట్రైనీ పూజా ఖేడ్కర్‌, యూపీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా నేపథ్యంలో స్మితా సభర్వాల్ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో దివ్యాంగులను గౌరవిస్తూనే విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవని, ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని, ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరమని, ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? అని అడుగుతున్నానంటూ ట్వీట్ చేశారు.

అయితే స్మితా సభర్వాల్‌ ట్వీట్​పై పలువురు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘‘వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదని అన్నారు. ఈ పోస్టు చూస్తోంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోందని సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ కరుణ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘ఈ పోస్ట్‌ చూస్తోంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోంది’’ అని ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు.

Last Updated : Jul 22, 2024, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details