Collection of Old Coins: 26 సంవత్సరాలుగా నాణేలు, స్టాంప్‌లు ఎక్కడ దొరికినా, అవి సేకరించి భద్రపరుస్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది అతడిని పిచ్చోడని హేళన చేసినా పట్టించుకోలేదు. ఇలా సేకరించడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు. దీనికి ఫలితంగా అతని దగ్గర ప్రస్తుతం టిప్పు సుల్తాన్ నాణేలు, సంఘ సంస్కర్తలు స్టాంప్‌లు(Old Stamps), ఇతర దేశాల కరెన్సీ, ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే వావ్ అనాల్సిందే. అతను ఎవరో కాదు మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌కు చెందిన జీడిమెట్ల యాదగిరి.
యాదగిరి 1997లో తూప్రాన్ లైబ్రరీలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ప్రమోషన్ మీద మెదక్ వచ్చాడు. అక్కడ వివిధ దిన పత్రికలు, మ్యాగజైన్లు చదువుతుండగా భిన్నంగా ఉండే కాయిన్‌లు, కరెన్సీ నోట్లు సేకరించిన వారి గురించి ప్రచురితమయ్యే వార్తలు చూసి అతనికీ అలాంటివి సేకరించాలనే ఆసక్తి ఏర్పడింది.
సాయి భక్తులకు గుడ్‌న్యూస్- బంగారు, వెండి కాయిన్స్ తయారీ- భక్తులిచ్చిన కానుకలతోనే!
Yadagiri Collect old Coins and Stamps: ఉద్యోగరీత్యా ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో నర్సాపూర్ నుంచి తూప్రాన్‌కు వెళ్లే క్రమంలో టికెట్ తీసుకునేటప్పుడు కండక్టర్ ఇచ్చే చిల్లర నాణేలను ఇంట్లో దాచడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత వాటిని పరిశీలిస్తే, చాలా వరకు వెరైటీ కాయిన్స్ లభించాయి. ఆ రోజు నుంచి ఆయన కాయిన్స్‌ను సేకరించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. తన స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువులు, తెలిసిన వారి వద్ద ఏదైనా నాణెం కొత్తగా అనిపిస్తే, దాని విలువకు తగిన డబ్బు ఇచ్చి వాటిని తీసుకునేవాడు. దీంతో అతణ్ని పిచ్చివాడు అనుకునే వారని యాదగిరి వాపోయాడు. పురాతన కాలం నాటి, భిన్నంగా ఉన్న కాయిన్స్ హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్, చార్మినార్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో అమ్ముతారనే విషయం తెలిసి, అక్కడికి వెళ్లి కొనుక్కొని వచ్చేవాడు. తనకు కావాల్సిన నాణెం కోసం డబ్బుకు వెనకాడకుండా వారు అడిగినంత ఇచ్చి దానిని తీసుకునేవాడు.
చిల్లర నాణేలతో నామినేషన్‌కు వచ్చిన జహీరాబాద్ బీఎంపీ అభ్యర్థి, నిరాకరించిన రిటర్నింగ్ ఆఫీసర్