తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు మా ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచాయి : సీఎం రేవంత్‌ రెడ్డి - cm revanth REACTION - CM REVANTH REACTION

CM Revanth on Election Results 2024 : రాష్ట్ర ప్రజల మద్ధతు కాంగ్రెస్‌ పార్టీకే ఉందని మరోసారి నిరూపితమైందని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు.

CM Revanth reacts on Election Victory
CM Revanth on Election Results 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 10:57 PM IST

CM Revanth reacts on Election Victory : రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ, 8 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్‌లో విజయంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అందించిన ఆశీర్వాదాలు మా ఆత్మస్థైర్యాన్ని పెంచాయని పేర్కొన్నారు. మరింత సమర్ధవంతమైన పాలన అందివ్వడానికి ఉత్సాహాన్నిచ్చాయన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 సీట్లు - 'ఎంఐఎం'దే హైదరాబాద్ - తెలంగాణలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు వీరే - MP Elections Results

ప్రజల మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని తెలిపారు. కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు. ఇది కార్యకర్తల విజయమని, వారి శ్రమ, కష్టం పార్టీ గుర్తిస్తుందని వెల్లడించారు. రేపటితో ఎన్నికల కోడ్ ముగుస్తోందని, మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజా పాలన ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కంటోన్మెంట్‌ ఉపఎన్నికలోనూ గెలుపొందింది. ఇవాళ జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే హోరాహోరీ పోరుసాగింది. బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వానేనా అన్నట్లు సాగిన కౌంటింగ్‌లో తల 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతయ్యింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక హైదరాబాద్‌ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ గెలుపొందారు.

CM Revanth Congratulates CBN :మరోవైపు ఆంధ్రప్రదేశ్​ శాసనసభ ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​లకు సీఎం రేవంత్​ శుభాకాంక్షలు తెలిపారు.​ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని సీఎం ఆకాంక్షించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని ఆయన కోరారు.

8 స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్​లో నయా జోష్ - గాంధీ భవన్​లో హూరెత్తిన సంబురాలు - Telangana Lok Sabha Elections 2024

తెలంగాణలో కాంగ్రెస్​ జయకేతనం - 8 స్థానాల్లో విజయదుందుభి - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details