తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంక్​ బండ్​ చుట్టూ స్కైవాక్​, పర్యాటక వలయం ఏర్పాటు : సీఎం రేవంత్ - CM REVANTH ON NEW TOURISM POLICY

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు - అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం - ఫిబ్రవరి 10లోగా పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని స్పష్టీకరణ

Tourism Development  In Telangana
Cm Revanth On Development Tourism (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 9:54 AM IST

Cm Revanth On New Tourism Policy : తెలంగాణలో ఉన్న సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10లోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాలను రాష్ట్రానికి ఆదాయం, గుర్తింపు వచ్చేలా రూపొందించాలని పేర్కొన్నారు. ఎకో టూరిజానికి అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను సింగపూర్ తరహా విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

పర్యాటకశాఖపై సీఎం రేవంత్ సమీక్ష : సీఎం తన నివాసంలో పర్యాటకశాఖపై సమీక్ష నిర్వహించారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ పర్యాటకరంగం నుంచి వచ్చే ఆదాయం పెరిగితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని తెలిపారు.

ట్యాంక్ బండ్ చుట్టూ స్కైవాక్ : హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య, ఎన్టీఆర్, ఇందిరా పార్కులను కలుపుతూ ట్యాంక్ బండ్ చుట్టూ స్కైవాక్, పర్యాటక వలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. వరంగల్​లోని మేడారం, రామప్ప దేవాలయం, లక్నవరం చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్​లో కేరళ తరహా హౌస్​బోట్ ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేలా :బౌద్ధ పర్యాటక కేంద్రాల్ని కలుపుతూ సర్క్యూట్​తో పాటు సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయలని అధికారులకు తెలిపారు. అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

బొటానికల్‌ గార్డెన్‌లో ఎకో టూరిజం ప్రాజెక్టు - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

ABOUT THE AUTHOR

...view details