CM Revanth Reddy on Lok Sabha Polls 2024 :రాష్ట్రంలో 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతోందని, రెండంకెల సీట్లు కచ్చితంగా గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 7న దిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee) సమావేశం తర్వాత తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. తమ కుటుంబం నుంచి ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని సీఎం స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామని రేవంత్ అన్నారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) తమ ప్రభుత్వ పనితీరును చూసి ఓటేయాలని ప్రజలను కోరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అవగాహనతో వెళ్తున్నాయని మెదక్, చేవెళ్ల స్థానాలకు గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం దీన్ని తేటతెల్లం చేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ, బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు వారి నిజరూపాలను బయట పెట్టిందని ఆరోపించారు.
CM Revanth Fires on BRS :మోదీని పెద్దన్నగా అభివర్ణిస్తూ మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్రమోదీని పెద్దన్న అనడంలో తప్పేముందన్న ఆయన, రాష్ట్రాభివృద్ధిపై ప్రధానితో చెప్పడం తన బాధ్యత అన్నారు. తాను కేసీఆర్‌లాగా కుమారుడిని సీఎం చేయమని చెవిలో గుసగుసలాడలేదని, 4 కోట్ల ప్రజల తరఫున రాష్ట్రానికి అవసరమైన విషయాలు బహిరంగంగానే అడిగినట్లు చెప్పారు.
క్యా సీన్ హై! - ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, రేవంత్‌ల మధ్య సరదా సంభాషణ
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో సంబంధం లేకుండా తుమ్మిడిహట్టిని నిర్మిస్తామని, ఆదిలాబాద్‌కు మరో ప్రత్యామ్నయం లేదని సీఎం స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుతో లక్షా 66 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, దానికోసం మహారాష్ట్రలో 1,850 ఎకరాలు సేకరించాల్సి ఉన్న విషయాన్నే ప్రధానిని కోరానని చెప్పారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మేడిగడ్డ విషయంలో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.