Clashes in AP Lok Sabha Election 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా, పలుచోట్ల వైఎస్సార్సీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాడులు, కిడ్నాప్లతో రెచ్చిపోతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఏడుగురు పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్: చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఏడుగురు పోలింగ్ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తుకెళ్లారు. ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారు. మరో స్వతంత్ర అభ్యర్థికి చెందిన పోలింగ్ ఏజెంట్లను సైతం కిడ్నాప్ చేశారు. పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ చేశారు.
సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర కిడ్నాప్ ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు తెలిపారు. అదే విధంగా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఫిర్యాదు పేర్కొన్నారు.
టీడీపీ ఏజెంట్లపై దాడి:పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మూకల దాడిలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో గొలవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని చెప్పింది. పల్నాడు ప్రాంతానికి ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు.
ఏపీ ఎన్నికల్లో జగన్‌కు దారుణ పరాభవం : ప్రశాంత్ కిషోర్ - Prashant Kishor on AP Elections
అధికారులతో వైఎస్సార్సీపీ నేతల వాగ్వాదం:అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించలేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతోనే అనుమతించడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలింగ్ కేంద్రంలోకి రావడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా నిన్న సాయంత్రమే ఏజెంటు పాసులు తీసుకోవాలని అధికారులు కోరారు. నిబంధనలు పెట్టినా పాసులకు దరఖాస్తు వైఎస్సార్సీపీ ఏజెంట్లు చేయలేదు. ఇవాళ నేరుగా పోలీంగ్ కేంద్రానికి వచ్చి పాసులు ఇవ్వాలన్నారు. దీంతో పాసులు ఇచ్చేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించారు. పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. గొడవ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
బస్సుల ఏర్పాటులో ఏపీఎస్ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - Passengers Problems in AP
వైఎస్సార్సీపీ దౌర్జన్యం:అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో వైఎస్సార్సీపీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేశారు. 201వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేయడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.