తెలంగాణ

telangana

ETV Bharat / state

సినిమా రేంజ్‌లో మర్డర్‌ - భయంతో తలుపులు వేసుకున్న స్థానికులు - పోలీసులు వచ్చేసరికి? - THREE KILLED IN KAKINADA CLASH

ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడలో దారుణం - రెండు కుటుంబాల మధ్య గొడవ - ముగ్గురి హత్య - భయంతో తలుపులు వేసుకున్న స్థానికులు

Three Killed in The Clash Between The Two Groups in Kakinada
Three Killed in The Clash Between The Two Groups in Kakinada (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 2:59 PM IST

Three Killed in The Clash Between The Two Groups in Kakinada :ఇటీవల కాలంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆస్తి కోసం తోబట్టువులను చంపిన ఘటనలు, ఇన్సూరెన్స్‌ కోసమో లేక వారిని చూసుకోవడం ఇష్టలేకనో కన్న తల్లిదండ్రులను హతమార్చిన ఉదంతాలు అనేకం. ప్రేమ పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకోవడం, పాత కక్షలంటూ ప్రాణాలు తీయడం రోజుకో ఒక దగ్గర మనకు తారసపడుతూనే ఉన్నాయి. వర్గ పోరులని, గొడవలు ఇలా ఏదో ఒక కారణంతో లెక్కచేయకుండా అవతల ఉన్నది మన అమ్మానాన్నలా, తోబుట్టువులా ఇలాంటివి ఏమీ లేదు ప్రాణాలు తీసేస్తున్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లా కాజులూరులో చోటుచేసుకుంది.

ఘటనలో ముగ్గురు మృతి :కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో రెండు కుటుంబాల మధ్య భగ్గుమన్న ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. శలపాక చిన్నపేటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో బత్తుల చిన్నా, బత్తుల రాజా, బత్తుల రమేష్‌ను పొట్లకాయాల నాగేశ్వరావుతో పాటు మరో నలుగురు విచక్షణా రహితంగా నరికేశారు. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో అన్నదమ్ములతో పాటు వారి కుటుంబసభ్యుడు కూడా ఉన్నాడు.

రూ.1,000 కోసం స్నేహితుడి హత్య - శవాన్ని 3 భాగాలుగా నరికి మురుగు కాల్వలో

భయంతో తలుపులు వేసుకున్న స్థానికులు : మృతుల భార్యలు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. గొల్లపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శలపాక గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌, డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలు జరిగిన వెంటనే భయంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇంట్లోకి వెళ్లి తలుపులు గడియపెట్టి లోపలే ఉండిపోయారు. కోపంలో ఉన్నవారు తమపై ఎక్కడికి వస్తారోనని భయపడ్డారు. పోలీసులు వారిని బయటకు రప్పించి విచారించారు. నిందితులను పొట్లకాయల నాగేశ్వరరావు, బేబీతో పైటు మరో ముగ్గురిని గుర్తించారు. మృతదేహాలను కాకినాడు జీజీహెచ్‌కు తరలించారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రియుడితో కలిసి మూడో భర్తను కొట్టిచంపిన భార్య - ఆపై స్పాట్​లో నుంచి మరో ప్రియుడికి ఫోన్​ చేసి?

రూ.5వేల కోసం భార్య పీకను కత్తితో కోసి హతమార్చిన భర్త

ABOUT THE AUTHOR

...view details