తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ పోడు పోరు - తుంగెడలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం - PODU FARMING CONFLICT IN ASIFABAD

Podu Farming Conflict in Asifabad : ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు దారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్రమంగా పోడు భూముల్లో సాగు చేస్తున్నారని పోడు రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట జరిగింది.

Podu Farming Conflict in Asifabad
Podu Farming Conflict in Asifabad

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 2:50 PM IST

పోడు వ్యవసాయం విషయంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య గొడవ

Clash Between Forest Officials and Podu Farmers :అటవీ శాఖ భూముల్లో చెట్లు, పొదలను నరికి పోడు వ్యవసాయం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు వెంటనే అక్కడ వెళ్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అధికారులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో తోపులాట జరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామ శివారులోని రిజర్వ్​ ఫారెస్ట్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :తుంగెడ గ్రామ శివారులోని రిజర్వ్​ ఫారెస్ట్​ అటవీ శాఖ భూములలో తుంగెడ గ్రామస్థులు చెట్లు, పొదలను నరికి అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ భూమిని చదును చేయడానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకుని చెట్లను నరకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ భూమిని చదును చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య మాట మాట పెరిగి వివాదం చోటుచేసుకుంది. అధికారులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలు అయ్యాయి. అక్కడ ఘర్షణ వాతావరణం చెలరేగింది.

ABOUT THE AUTHOR

...view details