Chilli Farmers Problems in Telangana : గత ఏడాది సీజన్‌లో వరంగల్, ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప రూ.25 వేల వరకు పలికింది. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనూ కనిష్టంగా రూ.14వేలు, గరిష్ఠంగా రూ.20వేల వరకు పలికింది. దీంతో సీజన్ చివరి వరకు ఇవే ధరలు కొనసాగుతాయాని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి.మిరప కోతలు ముగింపు దశకు వస్తున్న వేళ పతనమవుతున్న ధరలు రైతుల్ని కోలుకోనివ్వడంలేదు. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.8 నుంచి రూ.15 వేలకు మించి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులైనా చేతికి రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో సరైన ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు కొన్ని రోజుల తర్వాత ధరలు బాగా వస్తాయన్న ఆశలతో శీతల గిడ్డంగుల్లో మిరప పంట నిల్వ చేయడంతో దాదాపు అన్ని చోట్ల కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయని వ్యాపార వర్గాలు తెలిపాయి.
Chilli Prices Declined Despite In Telangana :ఈ ఏడాది ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల్, సూర్యాపేట, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో 3.25 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. ఈ క్రమంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వరంగల్‌లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు బస్తాలు రాగా ఆ తర్వాత నుంచి మార్కెట్‌కు మిర్చి భారీ తరలివస్తోంది.