Cong Election Campaign in Telangana : రాష్ట్రంలో మిషన్-15 పేరుతో 15 స్థానాలు విజయం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు అంతా మంత్రులు, సీనియ నేతలు ఉండటంతో గెలుపు బాధ్యతను వారికే అప్పగించారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్‌రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha
Congress Election Strategy in Telangana : నామినేషన్ ప్రక్రియ మొదలవుతుండంతో రేపు ఉదయం మహబూబ్‌నగర్, సాయంత్రం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రచారసభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నెల 21న చామల కిరణ్ కుమార్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22, 23 తేదీల్లో సీఎం పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే లు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డితో దక్షిణాదితోపాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసేందుకు చొరవ చూపి సమయం కేటాయించాలని ఏఐసీసీ(AICC) కోరుతోంది. ఇందుకు అనుగుణంగా పీసీసీ నేతలు షెడ్యూల్ ఖరారు చేయనుంది.