ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"విశాఖ కథా చిత్రమ్‌"లో అడుగడుగునా అనుమానాలే! - Visakha drug case - VISAKHA DRUG CASE

Visakha drug case: రొయ్యల తయారీ మేతలో కలిపే డ్రై ఈస్ట్‌ ముసుగులో విశాఖ పోర్టుకు డ్రగ్స్‌ చేరిన కేసులో సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. తనిఖీల సమయంలో ‘ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. సీబీఐ అధికారులు డాగ్‌ స్క్వాడ్‌ను పంపమంటే, విశాఖ పోలీస్‌ కమిషనరే అక్కడికి ఎందుకు వెళ్లారు.? అనే అంశంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Visakha drug case
Visakha drug case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 8:59 AM IST

"విశాఖ కథా చిత్రమ్‌"లో అడుగడుగునా అనుమానాలే!

Visakha drug case:విశాఖ పోర్టుకు ‘డ్రై ఈస్ట్‌' మాటున భారీగా దిగుమతైన డ్రగ్స్‌ వెనుక ఎవరున్నారు? సీబీఐ విచారణకు, కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుపడ్డారు.? అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా? సీబీఐ అధికారులు డాగ్‌ స్క్వాడ్‌ను పంపమంటే, విశాఖ పోలీస్‌ కమిషనరే అక్కడికి ఎందుకు వెళ్లారు.? దేశీయంగా తక్కువ ధరకే దొరుకతున్న దూరాభారమైన బ్రైజిల్‌ నుంచి డ్రై ఈస్ట్‌ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు.?

రొయ్యల తయారీ మేతలో కలిపే డ్రై ఈస్ట్‌ ముసుగులో విశాఖ పోర్టుకు డ్రగ్స్‌ చేరిన కేసులో సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. పట్టుకున్న కంటైనర్‌లోని కొకైన్‌ నిల్వలను సీబీఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు. జడ్జి సమక్షంలోనే కంటైనర్‌లోని వెయ్యి బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్‌ నమూనాలు సేకరించారు. కిలో డ్రై ఈస్ట్‌లో కొకైన్‌ వంటి డ్రగ్స్‌ పరిమాణం ఎంత ఉందో తేల్చేందుకు వాటిని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌సైన్స్‌ల్యాబొరేటరీకిపంపనున్నారు. దీనికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో..ఆర్డర్‌ బుక్‌ చేసిన ఏజెన్సీ వివరాలు, సంప్రదించిన సమయంలో ఫోన్‌ కాల్‌ డేటా, నగదు లావాదేవీలపైనా సీబీఐ అధికారులు ఆరా తీశారు.

జగన్‌ జమానాలో మాదకద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌! - AP become a drug state

ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో, లెక్కలేనన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐస్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో విశాఖ పోలీస్‌ కమిషనర్‌ వివరణ కూడా, కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎప్పుడూ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌, డీసీపీలతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టే, విశాఖ సీపీ, శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకర్లతో మాట్లాడారు. సీబీఐ ఆరోపణల్ని ఆయన తొసిపుచ్చారు. కస్టమ్స్‌ ఎస్పీ అభ్యర్థన మేరకే, పోర్టుకు డాగ్‌ స్క్వాడ్‌ పంపామని, అక్కడికి వెళ్లాక డాగ్‌ స్క్వాడ్‌ అవసరం లేదని చెప్పడంతో, వెంటనే తిరిగి వచ్చేశామన్నారు. డాగ్‌స్క్వాడ్‌ను పంపమంటే ఎస్పీ స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది అర్థంకావడంలేదు. డాగ్‌స్క్వాడ్, కంటెయినర్‌ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో, తనిఖీల వీడియో చిత్రీకరణకు అంతరాయం కలిగిందనే కారణంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో అలా రాసిందంటూ సీపీ ముక్తాయించారు.

రొయ్యల మేత తయారీదారులు అధిక శాతం దేశీయంగా ఉత్పత్తి చేసే డ్రై ఈస్ట్‌నే వాడతారు. ఐనా "డ్రై ఈస్ట్‌" దేశంలో దొరకదన్నట్లు బ్రెజిల్‌ నుంచి ఎందుకు తెప్పించారన్నదీ అనుమానాస్పదమే. కర్ణాటకలో కిలో" డ్రై ఈస్ట్‌" 60 నుంచి 70 రూపాయల వరకూ పలుకుతోంది. అదే కిలో ధర బ్రెజిల్‌లో 170 రూపాయల వరకూ ఉంది. బ్రెజిల్‌- విశాఖపట్నం మధ్య సముద్ర మార్గంలో 18వేల 600 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ రవాణా ఖర్చులూ కలిపితే, బ్రెజిల్‌ నుంచి వచ్చే ఈస్ట్‌ ధర భారీగా ఉంటుంది. అయినా బ్రెజిల్‌ నుంచే ఎందుకు దిగమతి చేసుకుంటున్నారన్నదీ అంతుచిక్కడం లేదు. అందులోనూ ఒకేసారి 25 వేల కిలోలు తెప్పించడమూ సందేహాలకు తావిస్తోంది.! కంటైనర్‌ బుక్‌ చేసిన ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ యాజమాన్యం మాత్రం కొత్త మేత ప్లాంట్‌ ఏర్పాటులో భాగంగానే బ్రెజిల్‌ నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌ తెప్పిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. రొయ్యల కోసం టన్ను మేత తయారీకి 10 కిలోల డ్రైడ్‌ ఈస్ట్‌ కావాలని అంచనా. ఆ లెక్కన సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల డ్రైడ్‌ ఈస్ట్‌తో సుమారు 25 వేల టన్నుల ఆక్వా మేత, ఉత్పత్తి చేసే వీలుంటుంది.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు- ప్రతిపక్షంపై విచారణ జరపాలన్న అధికార పార్టీ నేతలు - Visakha Drugs Case

ABOUT THE AUTHOR

...view details