Cattle Gathered Around the Injured Cow in Annamayya District :ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో శనివారం ఓ యువకుడు రోడ్డ ప్రమాదానికి గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే, ఆ దారిన వెళ్లే వారెవరూ పట్టించుకోలేదు. చూసీ చూడనట్టు వెళ్లిపోయారు. అతడి తల్లి 'నా బిడ్డ ప్రాణాలు పోయేలా ఉన్నాయి - ఆసుపత్రికి తీసుకెళ్దాం ఒక్కరైనా కాస్త సాయం పట్టండయ్యా' అని గుండెలవిసేలా రోదించినా, ఎవ్వరూ వినిపించుకోలేదు. మనిషిలో మానవత్వాన్ని పరీక్షించి, అలసిపోయిన ఆ ప్రాణం నిస్సహాయతో గాల్లో కలిసిపోయింది.
చూసినా పట్టించుకోని జనం :విజయనగరంలోని వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.‘రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి, అయ్యా బాబూ రండయ్యా, ఆస్పత్రికి తీసుకెళ్దాం అంటూ బతిమిలాడినప్పటికీ ఎవరూ కనికరించలేదు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ఉన్నా, సాయం చేయడానికి ఎవరికీ మనసు రాలేదు. కిలోమీటరు దూరంలోనే మహారాజా గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. 5 నిమిషాల్లోపే వెళ్లగలరు కూడా. కానీ ఎవరూ స్పందించలేదు. చుట్టుపక్కల వారు ఎవరో 108 అంబులెన్సు వాహనానికి ఫోన్ చేశారు. సుమారు 12.45 గంటలకు ప్రమాదం జరగ్గా, అంబులెన్సు అరగంట తర్వాత అంటే 1.15కు వచ్చింది. అప్పటికే ఆ యువకుడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
'నా పింఛన్ ఇందుకోసం రావట్లేదా? - బతికుండగానే చంపేశారు కదా సారూ'