Case Registered Against Kaleshwaram SI Bhavani Sen :కాటారం పోలీస్ డివిజన్ మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానిసేన్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవానిసేన్ మహిళ కానిస్టేబుల్‌ను హత్యాచారం, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కాళేశ్వరంలో దారుణం - గన్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం - Kaleshwaram SI Rapes Lady Constable - KALESHWARAM SI RAPES LADY CONSTABLE
Case Filed on Kaleshwaram SI Bhavani Sen: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ భవానిసేన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనను బెదిరించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.
Published : Jun 19, 2024, 3:22 PM IST
అదే ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా హత్యాచారం చేసి, లైంగిక వేధింపులకు గురిచేస్తూ, ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఆమె గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
Kaleshwaram SI Arrested on Rape Charges : ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. దీంతో సదరు ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సై భవానీ సేన్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. అలానే సర్వీస్ రివాల్వర్‌ను సైతం పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి భవానీసేన్ సస్పెన్షన్‌కు గురయ్యాడు.