CAG Report on 74th Amendment Act Audit : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదని స్థానిక అవసరాలు, ఉమ్మడి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఏకీకృత ముసాయిదా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టంపై 2021 మార్చి నాటికి ఆడిట్(CAG Audit) సమీక్ష చేసి నివేదిక సమర్పించింది. రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు విధుల బదిలీని ఉదహరించినప్పటికీ చాలా వరకు విధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు, అనుబంధ సంస్థల ద్వారానే నిర్వహిస్తోందని పేర్కొంది.
అధికారాలను సర్కార్ వద్దే అంటిపెట్టుకున్నందున పట్టణ స్థానిక సంస్థలకు పొరుగు సేవల సిబ్బంది తప్ప, రెగ్యులర్ సిబ్బంది ఆవశ్యకత అంచనా, నియామకానికి ఎలాంటి అధికారాలు లేవని కాగ్(CAG) తెలిపింది. రాష్ట్రంలో మంజూరైన 8752 పోస్టులకు గానూ అందులో 45 శాతం పోస్టులు 3,900 ఖాళీగా ఉన్నాయని ఫలితంగా సేవలు అందించేందుకు పొరుగు సేవల సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక
CAG Report Urban Local Bodies : వరంగల్ మినహా ఎక్కడా నీటి మీటర్లు అమర్చలేదని, అక్కడ కూడా ఒక శాతం మాత్రమే పని చేశారని కాగ్ తెలిపింది. నీటి ఆడిటింగ్ లేదని, ఘన వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేదని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక సంఘం(TelanganaFinance Commission) గ్రాంట్లకు ప్రతిగా 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో నిధుల విడుదల 50 శాతం నుంచి 85 శాతం వరకు తగ్గడం పట్టణ ప్రాంత ఆర్థిక స్థితిని ప్రభావితం చేసిందని కాగ్ వ్యాఖ్యానించింది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లు కూడా రూ.647 కోట్లు తగ్గినట్లు పేర్కొంది. 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఆస్తుల బదిలీపై వసూలు చేసిన స్టాంపు డ్యూటీపై సర్‌ఛార్జీ మొత్తం రూ.1822 కోట్లను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేయలేదని తెలిపింది.
ప్రతి పురపాలక సేవపై ధరను అంచనా వేయాలి : పట్టణాల్లో ఆస్తిపన్ను, నీటి పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయని వాస్తవ రాబడి కంటే చేస్తున్న ఖర్చు అధికంగా ఉందని కాగ్ వివరించింది. సేవలు సమర్థంగా అందించేందుకు వీలుగా ఆదాయ వనరులు, అవసరాలను వాస్తవికంగా అంచనాకు వీలుగా ప్రతి పురపాలక సేవపై ధరను అంచనా వేయాల్సిన అవసరం ఉందని కాగ్ తన నివేదికలో సూచించింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు
ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్ రిపోర్టు