1.25
అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా
1.20
ఆదిలాబాద్ సహా ఎగువ జిల్లాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేస్తామని తెలిపారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం సత్వరమే పూర్తిచేస్తామన్నారు.
కోయిల్‌సాగర్ ఎత్తిపోతలను త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ఇందిరమ్మ వరద నీటి కాల్వ జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం సత్వరం పూర్తిచేస్తాన్నారు కొమురంభీమ్, చిన్న కాళేశ్వరం సత్వరమే పూర్తికి చర్యలు చేపడతామన్నారు.
1.16
రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి తేల్చాల్సిన బాధ్యత మాపై పడిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటా సాధనకు రాజీలేని పోరాట చేస్తామన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తామని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్లను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ సహా ఎగువ జిల్లాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తిచేసి ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేస్తామని తెలిపారు.
1.10
నీటిపారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయన్నారు. నీటిపారుదలరంగ నిపుణుల సలహాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమకు తెలిసిందే వేదమంటూ గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. పదేళ్ల ఒంటెద్దు పోకడతో సాగునీరు, ఆర్థిక రంగాలు అతలాకుతలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం శాపంగా మారిందన్నారు.
1.08
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాలు
స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సత్వర చర్యలు
1.05
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
1.01
ఉద్యోగాల నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ముందడుగు వేశామని తెెలిపారు.
త్వరలో 15 వేలమంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ.40 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు
12.59
వర్సిటీల మౌలిక సదుపాయాల కోసం రూ.500 కోట్లు
నిమ్స్ విస్తరణకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం ప్రారంభిస్తామని చెప్పారు.
12.57
అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్ఠికాహారం అందిచే దిశగా అడుగులు వేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయడమే తమ లక్ష్యమని భట్టి అన్నారు. సకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు. ఉన్నత విద్యామండలి సంపూర్ణ ప్రక్షాళనకు కృషి చేస్తామన్నారు.
12.53
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250 కోట్లు
బీసీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు
గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా 2 ఎంబీఏ కళాశాలలు
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు
12.49
గత పదేళ్లలో పేదలు, ధనికులకు మధ్య అంతరం పెరిగిందన్నారు. గురుకుల పాఠశాలలకు వసతులతో కూడిన సొంత భవనాలు, అన్ని గురుకుల పాఠశాలల్లో అందుబాటులోకి సౌర విద్యుత్ తీసుకువస్తామని తెలిపారు. ధరణి కొందరికి భరణం మరికొందరికి ఆభరణం చాలామందికి భారం అని భట్టి అన్నారు. ధరణి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామన్నారు. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశామని తెలిపారు.
12.46
త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వ రైతుబంధుతో అనర్హులే ఎక్కువగా లాభం పొందారని మండిపాటు.
కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు సాయమిచ్చారని విమర్శించారు.
పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు రైతుబంధు ఇచ్చారు. అనర్హులకు రైతుబంధు ఇవ్వడం అక్రమం. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేస్తాం
రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. కౌలు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నూతన మార్గదర్శకాలు అని భట్టి వివరించారు.
త్వరలో నూతన విత్తన విధానం తీసుకోస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం హామీ ఇచ్చారు.
12.41
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వికేంద్రీకరణ చేస్తామని తెలిపారు.
అర్బన్ జోన్‌గా ఔటర్ రింగ్‌రోడ్ లోపల ప్రాంతం
పెరి అర్బన్ జోన్‌గా ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతం
గ్రామీణ జోన్‌గా ఆర్‌ఆర్‌ఆర్ ఆవల ప్రాంతం
గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దుతాం. స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామ పరిపాలన వ్యవస్థను తిరిగి ప్రజల చేతుల్లో పెడతాం. అని భట్టి అన్నారు.
పాలనాపరంగా అన్ని సంస్థలు, వ్యవస్థలు ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు.
12.34