తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రేవంత్, ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు : కేటీఆర్ - KTR Fires On CM Revanth Reddy

KTR Meeting With Hanamkonda Leaders : ఈ దఫాలో ముఖ్యమంత్రి అవుతానని రేవంత్​రెడ్డి కూడా అనుకోలేదని, ఈ విషయం గురించి ఆయన దోస్తులే తనకు చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే 2028లో సీఎం అవుదామనుకొని, ఈ దఫా ఎన్నికల్లో నోటికొచ్చినట్లు అడ్డగోలు అబద్దాలు చెప్పారని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు.

KTR Fires On CM Revanth Reddy
KTR Meeting With Hanamkonda Leaders (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 6:45 PM IST

Updated : Sep 25, 2024, 7:32 PM IST

KTR Fires On CM Revanth Reddy: కాంగ్రెస్ ఇచ్చిన హామీల వారీగా కమిటీలు వేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వాటి అమలు కోసం ఆ బృందం షాడో గవర్నమెంట్ తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ భవన్​లో జరిగిన హన్మకొండ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​తో పాటు మండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఈ దఫాలో ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని ఆయన దోస్తులే తనకు చెప్పారని అన్నారు.

2028లో సీఎం అవుదామనుకొని నోటికొచ్చినట్లు అడ్డగోలు అబద్దాలు చెప్పారని ఎద్దేవా చేశారు. కొత్త పథకాలు కాదు ఉన్నవి ఇస్తేనే ఈ ముఖ్యమంత్రి గొప్ప అని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు. చిట్టి నాయుడు వాళ్ల అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాష్ట్రం మీద స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రేవంత్​రెడ్డికి రాష్ట్రం మీద, ప్రజల మీద ప్రేమ లేదని పైసలు సంపాదించుకోవడం మీదే ఉందని అన్నారు.

బీజేపీ ఎంపీలు కాంగ్రెస్​కు రక్షణ కవచంలా :కాంగ్రెస్ మీద తాము పోరాటం చేస్తుంటే బీజేపీ ఎంపీలు వాళ్లకు రక్షణ కవచంగా వస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రకటించిన అన్ని డిక్లరేషన్​ల మీద పోరాడుతున్నామని నిత్యం కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. కుంభకోణాలు చేసే నేతల బుద్ధి మారదని వరంగల్​లో భూకబ్జాలు జరుగుతున్నాయని తెలియజేశారు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలను శాసిస్తోందని గుర్తు చేశారు. పార్టీ నుంచి పోయిన చెత్త అంతా పోనివ్వండని, గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకొని పార్టీని మంచిగా నిర్మాణం చేసుకుందామని అన్నారు.

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు :పెద్దపెద్ద నాయకులు మంచి పదవులు అనుభవించి రేవంత్​రెడ్డి చుట్టూ తిరుగుతున్నారని పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో వారికి భయం మొదలైందని కేటీఆర్ తెలిపారు. స్టేషన్​ఘన్​పూర్ ఉపఎన్నికకు రాజయ్య అభ్యర్థి అని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఓటమి కూడా మంచిదేనని వ్యాఖ్యానించారు. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందని, చిట్టి నాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది అని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం తీరు చూసి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా వైపే చూస్తున్నారని ఆయన తెలిపారు.

"అసలు ముఖ్యమంత్రిని అవుతా అని రేవంత్ రెడ్డి కూడా అనుకోలే. ఆయన దోస్తులే నాకు చెప్పారు. 2028లో సీఎం అవుదామనుకున్నాడు. అందుకే నోటికి వచ్చినట్లు అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు. ఆడబిడ్డలకు తులం బంగారం అన్నాడు. తులం ఇనుము కూడా లేదు. "-కేటీఆర్, బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు

'హైడ్రా'మా కాదు హైదరాబాద్​ కోసం పని చేయండి : కేటీఆర్​ - KTR ON HYDRA DEMOLITIONS

హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు : కేటీఆర్‌ - KTR VISIT FATEH NAGAR STP

Last Updated : Sep 25, 2024, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details