Best Bikes Under 1 Lakh : ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు తమకంటూ ఒక మంచి బైక్ కొనుక్కోవాలని ఆశపడతారు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్స్ కోసం చూస్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్, బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో లభించే టాప్-10 బైక్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Honda SP 125 : రోజువారి ప్రయాణాలు చేసేవారికి హోండా ఎస్పీ 125 బాగా ఉపయోగపడుతుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ - 124 సీసీ
- మైలేజ్ - 65 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 117 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
- సీట్ హైట్ - 790 మిల్లీ మీటర్లు
- పవర్ -10.72 bhp @ 7500 rpm
- టార్క్ -10.9 Nm @ 6000 rpm
- ధర - రూ.87,468 - రూ.91,468
2. Honda Shine : రూ.90వేలు బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ టూ-వీలర్స్‌లో హోండా షైన్ ఒకటి. ఇది అత్యంత పాపులర్ బైక్. దీని డిజైన్ చాలా బాగుంటుంది.
- ఇంజిన్ - 125 సీసీ
- మైలేజ్ - 55 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 114 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
- సీట్ హైట్ - 791 మిల్లీ మీటర్లు
- పవర్ -10.59 bhp @ 7500 rpm
- టార్క్ -11 Nm @ 6000 rpm
- ధర - రూ.81,251 -రూ.85,251
3. TVS Raider 125 : టీవీఎస్ రైడర్ 125 అనేది స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో ఈ బైక్ లభించనుంది.
- ఇంజిన్ - 124.8 సీసీ
- మైలేజ్ - 56.7 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- సీట్ హైట్ - 780 మిల్లీ మీటర్లు
- పవర్ - 11.2 bhp @ 7500 rpm
- టార్క్ - 11.2 Nm @ 6000 rpm
- ధర - రూ.84,869 - రూ.1.04 లక్షలు
4. Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 80 కి.మీలకు పైగా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెన్స్ ఖర్చు చాలా తక్కువ.
- ఇంజిన్ - 97.2 సీసీ
- మైలేజ్ - 80.6 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్- 112 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
- సీట్ హైట్ - 785 మిల్లీ మీటర్లు
- పవర్ - 7.91 bhp @ 8000 rpm
- టార్క్ - 8.05 Nm @ 6000 rpm
- ధర - రూ.76,676 - రూ.79,426
5. Bajaj Pulsar 125 : బజాజ్ పల్సర్ 125 అనేది స్పోర్ట్స్ బైక్. ఇది 2 వేరియంట్లు, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటాయి.
- ఇంజిన్ - 124.4 సీసీ
- మైలేజ్ - 50 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 140 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.5 లీటర్లు
- సీట్ హైట్ - 780 మిల్లీ మీటర్లు
- పవర్ - 11.64 bhp @ 8500 rpm
- టార్క్ - 10.8 Nm @ 6500 rpm
- ధర - రూ.92,883 - రూ.97,133
6. Hero Xtreme 125R : ఈ బైక్ మంచి లుక్‌లో ఉంటుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైకుల్లో ఇదొకటి.
- ఇంజిన్ -124.6 సీసీ
- మైలేజ్ - 66 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- సీట్ హైట్ - 794 మిల్లీ మీటర్లు
- పవర్ - 11.4 bhp @ 8250 rpm
- టార్క్ - 10.5 Nm @ 6000 rpm
- ధర - రూ.95,000 - రూ.99,500
7. Bajaj Freedom 125 : బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్ సైకిల్. ఎల్ఈడీ హెడ్లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్సీడీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్ రిసీవింగ్ బటన్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉంటాయి.
- ఇంజిన్ - 125 సీసీ
- మైలేజ్ - 65 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 147.8 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 2 లీటర్లు
- పవర్ - 9.5 Ps @ 8000 rpm
- టార్క్ - 9.7 Nm @ 5000 rpm
- ధర - రూ.89,997 - రూ.1.10 లక్షలు
8. Hero Glamour : హీరో గ్లామర్ 2 వేరియంట్లు, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలు చేసేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
- ఇంజిన్ - 124.7 సీసీ
- మైలేజ్ - 55 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 122.5 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- సీట్ హైట్ - 790 మిల్లీ మీటర్లు
- పవర్ - 10.53 PS @ 7500 rpm
- టార్క్ - 10.4 Nm @ 6000 rpm
- ధర - రూ. 82,598 - రూ.86,598
9. Revolt Motors RV1 : రివోల్ట్ మోటార్స్ ఆర్వీ1 ఈవీ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 160 కి.మీల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
- రేంజ్ - 100 కి.మీ/ఛార్జ్
- ఛార్జింగ్ టైమ్ - 2.15 గంటలు
- బ్యాటరీ కెపాసిటీ - 2.2 kwh
- ఇన్స్ట్రూమెంట్ కన్సోల్ - డిజిటల్
- ధర - రూ.84,990 - రూ.99,990
10. Atumobile Atum Vader : ఈ బైక్ సింగిల్ వేరియంట్లో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిపై గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ సీటు ఎత్తు 809 మిల్లీమీటర్లు.
- రేంజ్- 82 కి.మీ/ఛార్జ్
- మ్యాక్స్ స్పీడ్ - 65 కి.మీ/గంట
- ఛార్జింగ్ టైమ్ - 3-4 గంటలు
- ధర - రూ.99,999