Deputy CM Bhatti Vikramarka Review Meet With Collectors : సమగ్ర కుటుంబ సర్వేలో డోర్ లాక్ ఉన్న వారికి, వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృశ్య మాద్యమ సమీక్ష నిర్వహించారు.
సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సర్వేపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. డేటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమైందని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.
సొంతూళ్లలోనే కుటుంబ వివరాలు వెల్లడిస్తాం - ఎన్యూమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనాలు
ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలి : సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అందుకు వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాని తెలిపారు. కాగా పనులకు వెళ్లిన వారు సమగ్ర కుటుంబ సర్వే ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోన చెందుతున్నారు. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సర్వే గురించి సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
అధికారులు తగు చర్యలు తీసుకోవాలి : కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. పాఠశాలల్లో ఆహారం, పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టి సారించిందని.. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రకమైన సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఆ జిల్లాల్లో 100శాతం పూర్తయిన కుటుంబ సర్వే - తొలిస్థానం మాత్రం ఆ జిల్లాదే
'సర్వే చేయడానికి మీ ఇళ్లకు రాను - మీరే పంచాయతీ కార్యాలయానికి రండి'