తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్ ట్రాలీ​ కిందపడి చిన్నారి మృతి - ఆటో బోల్తా పడి 10 మంది కూలీలకు గాయాలు - telangana road accidents - TELANGANA ROAD ACCIDENTS

Road Accidents in Telangana : రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒక బాలుడు మృతి చెందగా, 10 మంది కూలీలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటనలు మెదక్​ జిల్లాలో జరిగాయి. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accidents in Telangana
Road Accidents in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 2:13 PM IST

Boy Died After Falling Under the Tractor at Medak : ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ ట్రాలీ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోసు రమేష్​, శివలక్ష్మి పోతంశెట్టిపల్లిలో నివాసం ఉంటున్నారు. భూమి పంచాయితీ కోసం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్​ మేరజ్​ ఇంటికి వెళ్లారు. పంచాయితీ జరుగుతుండగానే ఇంటి యజమాని కుమారుడు సయ్యద్​ ఫాద్​ పాషా నిలిపి ఉంచిన ట్రాక్టర్​ను వెనకాలకు తీశాడు. అక్కడే రమేశ్​ రెండేళ్ల కుమారుడు ఆడుకుంటున్నాడు.

ఇది గమనించక ఆ వ్యక్తి వెనుకకు ట్రాక్టర్​ను తీశాడు. దీంతో బాలుడు ట్రాక్టర్​ వెనక టైర్​ కిందపడ్డాడు. వెంటనే ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే కుమారుడు విగతజీవిగా మారడంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

గ్రామస్థుల దాడి : కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు ట్రాక్టర్​ నడిపిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అజాగ్రత్తగా నడపడం వల్లే చిన్నారి మృతి చెందారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. ఈ విషయంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి యజమానిపై దాడి చేసిన వారిని అడ్డుకుని పోలీసులు నచ్చజెప్పారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలు : మరో ప్రమాదంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడి పది మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషయంగా మారింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ తాలూక అయిజ మున్సిపాలిటీ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మపేటకు చెందిన ట్రాలీ ఆటో ఉదయం 30 మంది కూలీలతో వెళుతోంది. ఒక్కసారిగా వాహనం బోల్తాపడడంతో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ట్రాలీ ఆటో వేగంగా వెళుతున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలైన వారిని హుటాహుటిగా కర్నూల్​ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మూడో అంతస్థులోని పిట్టగోడ కూలి భర్త మృతి - భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు - Wall Collapse One Person Died

టైర్​ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి- మరో ప్రమాదంలో ఆరుగురు మరణం - Road Accident

ABOUT THE AUTHOR

...view details