Second Hand Car Sales in Hyderabad :మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గతంతో పోలిస్తే కాస్త పెరిగింది. కరోనా తర్వాత విహార యాత్రలకు, కుటుంబాలతో కలిసి ట్రిప్పులకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదం కోసం టూర్లకు వెలుతున్నారు. ప్రజా రవాణా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సొంత వాహనాలపై ప్రయాణానికి ఇష్టపడుతున్నారు.
కరోనా సమయంలో మూకుమ్మడిగా ప్రయాణించాలంటే వెనకడుగు వేసేవారు. ఆ సమయం నుంచి కార్లలో ప్రయాణంచే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది కార్లను సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఆ దిశగా డబ్బులు పోగు చేసుకొని కొత్త కార్లు కొంటున్న వాళ్లు కొంత మంది ఉంటే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లను కొనేవాళ్ల సంఖ్య క్రమంగా పెరగుతూ వస్తోంది. ఏటా ఈ వ్యాపారం 15శాతం వృద్ధి చెందుతోంది. ఇప్పటికే కార్ల కంపెనీలు సైతం కొత్త కార్లు విక్రయించే షోరూమ్‌లతో పాటు ప్రీ ఓన్డ్ షోరూమ్‌లను సైతం నిర్వహిస్తున్నాయి.
ట్రూ వాల్యూ పేరుతో మారుతి సుజుకి, ఫస్ట్ చాయిస్ పేరుతో మహీంద్ర కంపెనీలు ప్రీ ఓన్డ్ కారు షోరూమ్‌లను నిర్వహిస్తున్నాయి. కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు తమ ప్రీఓన్డ్ షోరూమ్‌లలో పాత కార్లను కొనుగోలు చేసి ఆ డబ్బులను కొత్తగా విక్రయించే కార్లలో డౌన్‌పేమెండ్ కింద లెక్కిస్తున్నాయి. కార్స్24, కార్‌వాలే, కార్‌ట్రేడ్, క్వికర్‌కార్స్, కార్ ఆండ్ బైక్, కార్ దేకో వంటి సంస్థలు సెకండ్ హ్యాండ్ కార్లను మాత్రమే విక్రయించేందుకు భారీ షోరూమ్‌లను నిర్వహిస్తున్నాయి.
Buy Second Hand Car Online : ఈజీ రిజిస్ట్రేషన్‌తో సెకెండ్ హ్యాండ్ కారు కొనాలా?.. టాప్ 10 వెబ్‌సైట్స్ ఇవే..!
ఐదేళ్లకే కారు మారుస్తున్న యజమానులు:కార్ల యజమానులు తమ కార్లను మార్చి కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కారును 8ఏళ్ల పాటు ఉపయోగించి ఆ తర్వాత కొత్తది కొనేవాళ్లు. ఇప్పుడు ఐదేళ్లకో మారు ఉన్న కారును మార్చేసి మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త మోడల్ కారును కొనుగోలు చేసేందుకు అభిలాషిస్తున్నారు. దీంతో ప్రీఓన్డ్ కార్లను కంపెనీలు కొనుగోలు చేసి మార్కెట్‌లో విక్రయానికి పెడుతున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్న వాళ్లలో దాదాపు 70శాతం మంది మొదటి సారి కారును కొంటున్న వాళ్లే ఉంటున్నట్లు కార్స్24 సంస్థ సర్వేలో తేలింది. అందులో కూడా దాదాపు అందరూ 30 నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లే. కారు కొనేందుకు డబ్బులు లేకపోయినా రుణం తీసుకొని మరి కొంటున్నారు.
హైదరాబాద్‌లోనే అధికం :హైదరాబాద్ మహానగరంలో 69శాతం మంది రుణం తీసుకొని మరి ప్రీఓన్డ్ కార్లను కొంటున్నారు. ఇతర మహానగరాల్లో 60శాతం మంది రుణాలతో కొంటున్నారు. ప్రీఓన్డ్ కార్లకు రుణాలు ఇచ్చే సంస్థలు తక్కువగా ఉండటంతో సంస్థలే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కొనుగోలుదారులకు రుణాలు అందిస్తున్నారు. 2019లో ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటు చేసిన కార్స్24 ఇప్పటి వరకు రూ.497 కోట్ల రుణాలను 15శాతం వడ్డీ చొప్పున ఇచ్చింది.
ఐదేళ్ల వ్యవధితో కిస్తులు కట్టే విధంగా సౌలభ్యం కల్పిస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10, ఐ20, మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెలినో ప్రీఓన్డ్ కార్లు ఎక్కువగా విక్రయమవుతున్నాయి. ప్రస్తుతం 25 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రీఓన్డ్ కార్ల వ్యాపారం రాబోయే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లోనే ప్రీఓన్డ్ కార్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కార్ల విక్రయాల వ్యాపారం ఎక్కువగా ఉండటంతో కొత్త వ్యక్తులు సైతం ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు.
Bank Seized Vehicles Auction : తక్కువ ధరకే.. సెకండ్ హ్యాండ్ కార్లు.. ఇలా ఇంటికి తెచ్చుకోండి!
సెకండ్ హ్యాండ్లో కారు కొంటున్నారా? ఇది మీ కోసమే..