ETV Bharat / entertainment

అజిత్ 'విదాముయార్చి' ట్రైలర్ ఔట్- తెలుగు టైటిల్ కూడా ఫిక్స్​ - VIDAAMUYARCHI TRAILER

అజిత్ 'విదాముయార్చి' ట్రైలర్ రిలీజ్- మీరు చూశారా?

Vidaamuyarchi
Vidaamuyarchi (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 6:59 PM IST

Pattudala Trailer : స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'విదాముయార్చి'. దర్శకుడు మగిజ్‌ తిరుమేని ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు 'పట్టుదల' అనే తెలుగు టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఫుల్ యాక్షన్ ప్యాక్డ్​గా ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫారిన్​ బ్యాక్​డ్రాప్​లో యాక్షన్ సీక్వెన్స్​లను డైరెక్టర్ మగిజ్‌ తిరుమేని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.

కాగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్, యంగ్ బ్యూటీ రెజీనా కసాంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై సుభాస్కరణ్ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమాతోపాటు 'గుడ్​ బ్యాడ్ అగ్లీ' ప్రాజెక్ట్​ కోసం కూడా అజిత్ కష్టపడుతున్నారు.

రేసింగ్​లో రయ్ రయ్
కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టపడే అజిత్ రీసెంట్​గా మంచి విజయం అందుకున్నారు. ఇటీవల ఆయన 'అజిత్‌ కుమార్ రేసింగ్‌' పేరుతో ఒక రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించారు. అదే టీమ్​తో రీసెంట్​గా దుబాయ్‌ వేదికగా జరిగిన '24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌'లో పాల్గొని విజయం అందుకున్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్‌ మూడో స్థానంలో నిలిచింది.

13ఏళ్ల తర్వాత
బైక్‌, కార్ రేసింగ్‌ అంటే ఎంతగానో ఇష్టపడే అజిత్‌, దాదాపు 13ఏళ్ల తర్వాత మోటార్‌ రేసింగ్‌లో పాల్గొన్నారు. ఈ రేస్ కోసం ఎన్నో రోజుల నుంచి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. గోడను బలంగా ఢీ కొనడం వల్ల కారు ముందు భాగం డ్యామేజ్‌ అయ్యింది. బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

కార్ రేసింగ్​లో అజిత్ టీమ్ విక్టరీ- నాగచైతన్య స్పెషల్ విషెస్

హీరో అజిత్ షాకింగ్ డెసిషన్ - ఆ పని పూర్తయ్యేంతవరకూ నో మూవీస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.