Bollaram Rashtrapati Bhavan Hyderabad : దేశ పాలన ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో దక్షిణాన హైదరాబాద్‌లోని బొల్లారంలో 1860లో బ్రిటీష్ అధికారులు రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వైశ్రాయ్ అతిథి గృహంగా పిలిచేవారు. 1950లో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ భవన్‌ను కేంద్రం నిజాం నుంచి 60 లక్షలకు కొనుగోలు చేసింది.
President Residence In Bollaram:వారసత్వ సంపదను కళ్ళకు కట్టే విశాలమైన భవంతులు నాటి చారిత్రక ఆనవాళ్ల రాష్ట్రపతి భవన్‌లో దర్శనమిస్తాయి. ఎక్కడ చూసినా అందమైన పచ్చిక బయలు కళ్లకు కనువిందు చేస్తాయి. నిజాంపై భారత సైన్యం విజయం సాధించాక ఆభవనంలో నిజాం జెండాను దించి మువ్వన్నెల పతాకాన్ని ఎగరవేసినందుకు గుర్తుగా 125 అడుగుల ఎత్తుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో భద్రతా కారణాలవల్ల ఆ భవనానికి అవసరమైన సామాగ్రి, ఆహార పదార్థాలు వంటివి బయట నుంచి నేరుగా తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక సొరంగ మార్గం అందరినీ ఆకట్టుకుంటుంది.
" రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు అవకాశం కల్పించాం. సోమవారం సెలవు దినం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. 12 వ తరగతి లోపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు 8 ఏళ్ల లోపు వయసున్న మిగతా చిన్నారులకు ప్రవేశం ఉచితం." -మేనేజర్, లక్ష్మి ప్రియ, రాష్ట్రపతి నిలయం