BJP State Chief Kishan Reddy Fires on Congress :మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ (BRS) పార్టీ ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిఅన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అయినా మాయమాటలు చెప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ, మధురానగర్ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం కారణంగా నగరంలోని బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్‌రెడ్డి
Minister Kishan Reddy Fires On BRS : హైదరాబాద్ అంటే హైటెక్ సిటీలు కాదని, పేద ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద ప్రజలను ఆదుకునేది బీజేపీ ప్రభుత్వమని తెలిపారు. దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాసేవను మాటల్లో కాకుండా, పని తనంలో ముందుండి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు.
"నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే తప్ప, బస్తీ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు. హైదరాబాద్ అంటేనే అతిపెద్ద ఆదాయం వచ్చే నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80 శాతం ఆదాయం కేవలం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. కానీ హైదరాబాద్‌కు కావాల్సిన వనరుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ (GHMC Funds) హైదరాబాద్‌కు మేజర్ కమ్యూనిటీ. కానీ ఇప్పుడు అది కూడా నిధుల కొరతతో ఉంది. నీటి సరఫరా, మెట్రో వర్క్స్ అన్ని పనులూ నిధుల కొరతతో ఆగిపోయాయి." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు