తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం' - ఎమ్మెల్యే రాజాసింగ్​కు బెదిరింపు కాల్స్ - DEATH THREAT TO BJP MLA RAJA SINGH

'ఈ రోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం' - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​కు రెండుసార్లు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ - పోలీసులు పట్టించుకోవడం లేదంటూ రాజాసింగ్ అసంతృప్తి

Rajasingh Received Threat Calls
BJP MLA Rajasingh Received Threat Calls (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 7:42 AM IST

BJP MLA Raja singh Received Threat Calls : 'ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం' అంటూ గుర్తు తెలియని వ్యక్తులు రెండుసార్లు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. తనకు, తన కుటుంబానికి తీవ్రవాద శక్తులతో ప్రాణహాని ఉందని ఏడాది క్రితమే ఐబీ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినా, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించడంలో అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు.

రాజాసింగ్​కు బెదిరింపు కాల్స్ : ఆదివారం రాత్రి ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మధ్యాహ్నం 3:30కు, సాయంత్రం 4 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరించారన్నారు. తనకు వివిధ దేశాల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై ఇంత వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకొని పని చేస్తున్న తనపై తీవ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రాణానికి హాని ఉందని తెలిసినా రక్షణ కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details