Dogs Killed Cobra Viral Video : సాధారణంగా పాములను చూడగానే చాలా మంది హడలెత్తిపోతారు. ఎంత ధైర్యవంతుడికైనా విషసర్పాలంటే వెన్నులో వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. అదేవిధంగా అటు మనుషులు, ఇటు జంతువులు సైతం పాము ఎదురు పడితే కాస్త వెనుకడుగు వేస్తాయి. కానీ రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లో తాజాగా జరిగిన ఓ ఘటనా దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇంతకీ ఏమి జరిగందంటే.. రెండు కుక్కలు ఓ భారీ నాగుపామును చీల్చి చెండాడాయి.
నాగుపాముపై కుక్కలు పదేపదే దాడి - ఒళ్లు గగుర్పొడిచేలా వీడియో - DOGS KILLED COBRA VIRAL VIDEO
వ్యవసాయ క్షేత్రంలో భారీ నాగుపామును చీల్చి చెండాడిన శునకాలు - పాముని నోట కరుచుకుని ఎక్కడపడితే అక్కడ కొరికి ప్రాణం తీసిన దృశ్యాలు
Dogs Killed Big Snake (ETV Bharat)
Published : Nov 1, 2024, 10:57 PM IST
మొగిలిగిద్ద గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో యజమాని డాబర్మాన్ కుక్కలను పెంచుకుంటున్నాడు. శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రంలో పొడవైన పాము పెంపుడు కుక్కల కంటపడింది. దీంతో చెలరేగిన ఆ శునకాలు రెండు కలిసి ఆ పామును వెంటాడి వేటాడాయి. పాముని నోట కరుచుకుని ఎక్కడపడితే అక్కడ కొరికి ప్రాణం తీశాయి. చనిపోయాక కూడా పామును నోట్లో కరుచుకుని అటు ఇటు లాగిన దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది.