తెలంగాణ

telangana

ETV Bharat / state

అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ కలకలం - బీదర్‌ దొంగల ముఠా కాల్పులు, ఒకరి అరెస్ట్ - GUN FIRE IN AFZALGANJ HYDERABAD

అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌ దొంగల ముఠా కాల్పుల కలకలం - పోలీసులపై కాల్పులు జరిపిన బీదర్ దొంగల ముఠా - ఉదయం బీదర్​లో ఏటీఎం డబ్బులు చోరీ చేసిన గ్యాంగ్

GUN FIRE IN HYDERABAD
GUN FIRE IN AFZALGUNJ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 8:04 PM IST

Updated : Jan 16, 2025, 10:33 PM IST

Gun Fire in Afzalganj Hyderabad :ఉదయం బీదర్​లో ఏటీఎంలో డబ్బులు జమచేసే వాహనంపై దాడి చేసి దోచుకున్న బీదర్‌ దొంగలు హైదరాబాద్​లోనూ కలకలం సృష్టించారు. దొంగలను వెతుక్కుంటూ వచ్చిన బీదర్ పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా, ముఠాలో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

రాయపూర్​ వెళ్లేందుకు ప్లాన్ : అఫ్జల్‌గంజ్‌లో సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు ముగ్గురు రాయ్​పూర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. సాయంత్రం వారు బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో పోలీసులు రావడంతో వారిపై ఫైరింగ్ జరిపారు. ముఠా జరిపిన కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. జహంగీర్​ను అక్కడే సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాల్పుల్లో గాయపడ్డ రోషన్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ జహంగీర్‌ (ETV Bharat)

ప్రత్యక్ష సాక్షి అహ్మద్ చెప్పిన ప్రకారం "మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్​లో మూడు టికెట్లు రాయపూర్​కు బుక్ చేశారు. తిరిగి సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ నుంచి మేము వారిని మినీ బస్సుల్లో బస్సులు ఆగే స్థలం వద్దకు తరలించడానికి సిద్ధమయ్యాం. ఇదే సమంయలో మా సిబ్బంది అనుమానంగా ఉన్న బ్యాగేజీ తనిఖీ చేస్తారు. అదే క్రమంలో రాయపూర్​కు వెళ్తున్న నిందితుల బ్యాగేజీలను కూడా తనిఖీ చేస్తుండగా వారు డబ్బులు తీసి మా సిబ్బందికి ఇవ్వడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో అదే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోలీసులమని సిబ్బందికి చెప్పారు. ఇంతలోనే ఆ ముగ్గురు బ్యాగులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరపారు. దీంతో మా మేనేజర్ జహంగీర్​కు పొత్తికడుపుతో పాటు కాలికి గాయాలయ్యాయి."

అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ కలకలం - బీదర్‌ దొంగల ముఠా కాల్పులు, ఒకరి అరెస్ట్ (ETV Bharat)

పోలీసుల అదుపులో ఓ నిందితుడు : సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ ఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఉదయం ఇద్దరు సభ్యులున్న ఈ గ్యాంగ్ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.93 లక్షలున్న నగదు​తో పరారయ్యారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలను కోల్పోయారు. వారిని వెతుక్కుంటూనే బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

బైక్​పై వచ్చి ATM వ్యాన్​లో డబ్బులు చోరీ- సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు- ఒకరు మృతి

Last Updated : Jan 16, 2025, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details