తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడేళ్లలో విద్యుత్ డిమాండ్ డబుల్ అవుతుంది - అంచనా వేసిన ట్రాన్స్​కో - BHATTI VIKRAMARKA ON TRANSCO

ట్రాన్స్ -కో సంస్థ బలోపేతం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక - ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తు సరఫరా ప్రణాళికపై చర్చ

Bhatti Vikramarka Review Meet on  Strengthening Trans-Co
Bhatti Vikramarka Review Meet on Strengthening Trans-Co (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 7:50 PM IST

Bhatti Vikramarka Review Meet on Strengthening Trans-Co:రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తు సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు నిర్దేశం చేశారు. సోమవారం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్ -కో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్ల విద్యుత్తు పీక్ డిమాండ్ ఉన్నదని, రాబోయే ఏడు సంవత్సరాలకు 27వేల మెగా వాట్లకు పీక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ఆ అంచనాకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణను వెంటనే అమలు చేయాలని అన్నారు.

ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన :ట్రాన్స్-కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. సబ్ స్టేషన్​ల పనుల నిర్మాణానికి నిర్ణీత గడువు లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని సూచించారు. ఈ సంవత్సరం, రాబోయే రెండు సంవత్సరాల్లో సంస్థ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. డైరెక్టర్ నుంచి ఏఈ వరకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకొని సంస్థలు బలోపేతం చేసుకోవాలని సూచించారు.

'అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్ - ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు' - Tg Integrated Residential Schools

అధికారులకు శిక్షణ :నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రాన్స్​కోలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్​ను ఆదేశించారు. సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్లకు అధునాతన టెక్నాలజీ పైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ట్రాన్స్​కో బలంగా ఉన్నప్పుడే విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటుందన్నారు. సంస్థను ఆర్థికంగా బలంగా ముందుకు తీసుకోవడానికి డైరెక్టర్ నుంచి ఏఈ స్థాయి వరకు ఉన్న అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.‌ ట్రాన్స్ -కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న విద్యుత్తు సరఫరా, సబ్ స్టేషన్ల నిర్మాణం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : భట్టి విక్రమార్క - Deputy CM Bhatti Vikramarkha

గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరండి – ఉప ముఖ్యమంత్రి భట్టి - Deputy CM Bhatti Vikramarka US Tour

ABOUT THE AUTHOR

...view details