Save From Cyber Fraud And Digital Arrest :అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా +37052529259, +56322553736, +255901130460, +94777455913, +37127913091 ఇలాంటి నంబర్లతో ఫోన్ వస్తే ఎత్తకూడదని తెలిపారు. ప్రధానంగా (+371) (లాత్వియా), +381 (సెర్బియా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా), +375 (బెలారస్), +563 (లోవా), వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి, ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారని వివరించారు.
ఇంజినీరింగ్ విద్యార్థికి వీడియో కాల్ - లిఫ్ట్ చేస్తే నగ్నంగా అందమైన యువతి - కట్ చేస్తే?