Auto Driver Brutally Murdered in Hanamakonda :హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌పై కత్తితో దాడికి దిగి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండ మడికొండకు చెందిన రాజ్‌కుమార్, వెంకటేశ్ అనే ఇద్దరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన లావణ్య అనే యువతి కోసం గొడవ పడుతున్నారు. వారిద్దరు ఆ యువతిని ప్రేమిస్తున్నారు.
యువతి ప్రేమ కోసమే హత్య :తాజాగా బుధవారం మధ్యాహ్నం అదాలత్ సెంటర్ వద్ద గొడవకు దిగారు. ఈ క్రమంలో వెంకటేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. అక్కడ ఉన్నవారు ఆపినా ఆగలేదు. వెంకటేశ్ అనేక సార్లు రాజ్‌కుమార్‌ను పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే పడిపోయాడు.