తెలంగాణ

telangana

ETV Bharat / state

వారాహి యాత్రలో కలకలం- పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి - Attack On Pawan Kalyan Varahi Yatra

Attack on Pawan Kalyan in Varahi Yatra: తెనాలిలో జరుగుతున్న వారాహి యాత్రలో, పవన్ కల్యాణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌కల్యాణ్‌ పైకి రాయి విసిరాడు. పవన్ కల్యాణ్‌కు తగలకుండా రాయి దూరంగా పడింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జన సైనికులు, పోలీసులకు అప్పగించారు.

Attack on Pawan Kalyan
Attack on Pawan Kalyan in Varahi Yatra

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 6:38 PM IST

Updated : Apr 14, 2024, 10:00 PM IST

Attack on Pawan Kalyan in Varahi Yatra :ఎన్నికల ప్రచారంలో భాగంగాతెనాలిలో జరుగుతున్న వారాహి యాత్రలో, పవన్ కల్యాణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఏపీలో హీటెక్కిన రాజకీయం - చంద్రబాబు సభలోనూ రాళ్లు విసిరిన దుండగులు - Stones on CBN in Gajuwaka

Pawan Kalyan fires on Jagan :అనంతరం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) మాట్లాడుతూ.. "ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నా. ప్రజలు మోసం చేశారని నేనేమీ వెనక్కి తగ్గలేదు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చా. వకీల్‌ సాబ్‌ చెప్పినట్టు నేను మీ కూలీని. అధికారం ఇస్తే సంతోషంగా పనిచేస్తా. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు 5వ తేదీలోపు జీతాలు ఇస్తాం. వ్యాపార వర్గాలకు అండగా ఉంటాం. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తాం. కేవలం కులగణనే కాదు, ప్రతిభను గణించి మహిళలను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు.

Pavan Kalyan on Chiranjeevi Donation : కౌలు రైతులకు చేస్తున్న సాయం చిరంజీవిని కదిలించిందని పవన్‌ కల్యాణ్ అన్నారు. అన్నయ్య చిరంజీవి రూ.5కోట్లు విరాళం ఇచ్చారని. సాయం చేయాలని రామ్‌చరణ్‌కు కూడా సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజల కోసం బలంగా నిలబడ్డానని ప్రశంసించినట్లు తెలిపారు. దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే జగన్‌కూ పడుతుందని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్‌లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని, జగన్‌కు అధికార గర్వం తలకెక్కి అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు.

"అయిదు సంవత్సరాల జగన్‌ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్ధతు ఉంది కావునే పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు. త్వరలో జగన్‌కు శ్రీలంక అధ్యక్షుడిగా పట్టిన గతే పడుతుంది". - పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

వారాహి యాత్రలో కలకలం- పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి

చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న పవన్ - జనసేనకు మెగాస్టార్​ రూ. 5 కోట్ల విరాళం - Pawan Kalyan Met Chiranjeevi

'డాక్టర్' ​చరణ్​కు పవర్​స్టార్ స్పెషల్ విషెస్- ఆయన రియాక్షన్ ఇదే! - Ram Charan Pawan Kalyan

Last Updated : Apr 14, 2024, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details