Good News for Employees : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పలువురు ఉద్యోగుల అకౌంట్లలోకి జీతంతో పాటు అదనంగా ఒక నెల గౌరవ వేతనం కూడా పడనుంది. ఇంతకీ ఆ ఉద్యోగులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపులు క్యాడర్‌ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ఎన్నికల విధులు నిర్వహించిన డీఈవోలు, ఆర్వోలు, ఏఆర్వో, ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా అందుకు సమానంగా బోనస్ చెల్లించే అవకాశాలున్నాయి.
వారానికి 5రోజులే ఉద్యోగం : రాజధాని అమరావతి పరిధిలో పని చేస్తోన్న ఉద్యోగులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శుభవార్త అందించింది. అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో 5 రోజుల పని విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల అవకాశాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే - ప్రణాళికతో ముందుకు : ఏపీ సీఎం - ap cm chandrababu kuppam tour
ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల ఫైల్‌పై సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ జూన్ 27 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పని విధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడుకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
విభజన తర్వాత: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. అందులో భాగమే సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి 5 రోజుల పని విధానం. అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకూ ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు భావించగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ఎత్తేయాలని ఆలోచన చేసింది. అయితే, ఉద్యోగుల విజ్ఞప్తితో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ ఆ గడువు ముగుస్తుండడంతో తాజాగా సీఎం చంద్రబాబు మళ్లీ 5 రోజుల పని దినాల గడువును మరో ఏడాది పాటు పొడిగించారు.
ఏపీ ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM Chandrababu Visit to Kuppam
ఏపీలో నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీ - కీలక అంశాలపై నిర్ణయాలు! - AP Cabinet Meeting 2024