AP Deputy CM Pawan Kalyan on Telugu Industry Heros :సినిమా రంగంలో తనకు ఎవరితోనూ పోటీ లేదని ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఆయన గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోకులం నిర్మాణాలు, తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్య పరిష్కరించడం, పారిశుద్ధ్య పనులు, ఇతర 30వేల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తి చేసేలా పని చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని కేకలు వేయడంతో పవన్‌కల్యాణ్ స్పందించారు.
నాకు అలా వినిపించింది : ఇన్నాళ్లూ మీరు ఓజీ ఓజీ అంటుంటే నాకు ‘మోదీ.. మోదీ’ అని వినిపించేది. వినోదం అందరికీ కావాల్సిందేనని పవన్ అన్నారు. ఈ పల్లె పండుగ ఎందుకు చేస్తున్నామో చెబుతానని ప్రజలంతా అభిమాన కథానాయకుల సినిమాలకు వెళ్లాలని తెలిపారు. టికెట్ల కోసం డబ్బులు పెట్టాలి అంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి అన్న ఆయన, వినోదం కన్నా ముందు ప్రతీఒక్కరి కడుపు నిండాలన్నారు. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దామని చెప్పారు. రోడ్లు, స్కూల్స్‌ను బాగు చేసుకుందామని అన్నారు. ఆతర్వాతే విందులు, వినోదాలు, ఓజీలుని చెప్పారు.
అందరితో బాగుండాలి : సినిమాకు వెళ్లాలన్నా గోతులు లేని రోడ్లు ఉండాలి కదా అన్న ఆయన తనను అభిమానిస్తారో, నాకు కూడా వాళ్లంటే ఇష్టమే. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలతోనూ ఇబ్బంది లేదని తెలిపారు. తాను ఎవరితోనూ పోటీపడనని చెప్పారు. ఒక్కొక్కరూ ఒక్కో దాంట్లో నిష్ణాతులని అందరూ బాగుండాలని కోరుకున్నారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాని అందరూ బాగుండాలని కోరుకుంటానన్నారు. అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలని ముందు దానిపై దృష్టిపెడదాం’’ అని అన్నారు.