Anti Social Activities Are On the Rise in the Outskirts :హైదరాబాద్, ఘట్‌కేసర్, శామీర్‌పేట, శంషాబాద్ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణించినా అంతా చిమ్మచీకటే ఉంటుంది. అక్కడక్కడా రోడ్డు పక్కనే గంజాయి బ్యాచ్‌లు, మందు తాగుతూ కనిపించే పోకిరీలు ఇదే అవకాశంగా అక్కడ వ్యభిచారం. ఇదీ నగర శివార్లలో ఔటర్, సర్వీసు రోడ్లపై జరుగుతున్నవి. సాయంత్రం తర్వాత ఈ దారి వెంట ఒంటరిగా ప్రయాణించాలి అంటే ప్రజలు జంకుతున్నారు. సర్వీసు రోడ్డు, ఇంటర్ ఛేంజ్‌లు, సమీప ప్రాంతాల్లో భద్రతపై ఈటీవీ భారత్ పరిశీలనలో అనేక అసాంఘిక కార్యకలాపాలు బట్టబయలయ్యాయి.
భారీ విద్యుద్దీపాలతో ఔటర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. కానీ పక్కనే సర్వీసు రోడ్డు వెంట అంతా చీకటే. ఇంటర్ ఛేంజ్‌ల దగ్గర మినహా ఎక్కువ ప్రాంతాల్లో లైట్ల ఏర్పాటు తక్కువే. ఇదే అదనుగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడ బహిరంగంగానే వ్యభిచారం జరుగుతోంది. కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి మరి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌లు, చైన్‌స్నాచర్లు, దోపిడీ ముఠాలు ఇక్కడ తిష్ఠ వేస్తున్నాయి. ఇష్టారీతిన ఔటర్ వెంట రాత్రిపూట లారీలు నిలుపుతున్నారు. పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో ఉండడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
ఎవరు చంపుతున్నారు? - ఎందుకు చంపేస్తున్నారు? - అసలు ఆ హత్యలు చేస్తుందెవరు?
నెలల పాపతో సజీవ దహనం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్విస్ రోడ్డు వద్దకు తీసుకువచ్చి నిద్రమాత్ర ఇంచి దారుణంగా హత్య చేశాడు. ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని కొండాపూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పెట్రోల్ పోసి 8 నెలల బిడ్డతో సజీవ దహనం చేశాడు.