ETV Bharat / state

'చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పనిచేస్తోంది - త్వరలోనే గ్రూప్​1 నియామక పత్రాలు'

ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్​ రెడ్డి - చిన్న ఆరోపణ లేకుండా ప్రస్తుతం టీజీపీఎస్సీ పని చేస్తోందని హామీ - హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ మార్గ్​లోని హెచ్​ఎండీఏ గ్రౌండ్స్​లో జరిగిన కార్యక్రమం

REVANTH SLAMS BRS PARTY
CM REVANTH REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 10 minutes ago

Praja Palana Celebrations : చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందని, త్వరలోనే గ్రూప్​ 1 నియామక పత్రాలు ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్​ను​ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం మార్చిందని సీఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్​లో​ని ఎన్టీఆర్​ మార్గ్​ హెచ్​ఎండీఏ గ్రౌండ్స్​లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ గత పదేళ్ల పాలనపై సీఎం రేవంత్​ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత ముఖ్యంగా విద్య, వైద్యం అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 6,500 మందిని కొత్తగా వైద్యారోగ్య శాఖలో నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏడాదిలో వైద్యారోగ్య శాఖలో 14 వేల మంది నియామకం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 8 వైద్య కళాశాలు ఇచ్చి ఎలాంటి వసతులు కల్పించలేదని మండిపడ్డారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసమే పోరాటం చేసిందని గుర్తు చేశారు. స్వరాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు వస్తాయని యువత ఎంతో ఆశపడితే, బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక పరీక్షలు నిర్వహించిన పేపర్​ లీక్​లను అరికట్టలేకపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

"అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. కాంగ్రెస్​ ప్రభుత్వం నోటిఫికేషన్​ ఇస్తే పరీక్షలు షెడ్యూల్​ ప్రకారం జరుగుతాయని యువతకు నమ్మకం కలుగుతోంది. పరీక్షలు వాయిదా వేస్తూ పోతే యువత విలువైన యుక్త వయసు వృథా అవుతుంది. మన భవిష్యత్తు 21 నుంచి 35 ఏళ్లలోపు చేసే పనులే నిర్ణయిస్తాయి. ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తే యువత కోచింగ్​ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతారు. పరీక్షలు వాయిదా వేస్తే యువత ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పరీక్షలు నిర్వహిస్తే ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు రానివారు మరో పనో, వ్యాపారమో చేసుకుంటారు." అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

బుర్రా వేంకటేశంను ఒప్పించి : త్వరలోనే గ్రూప్‌1 ఉద్యోగాల నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. 563 గ్రూప్‌-1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం చేయబోతున్నాం అని ప్రకటించారు. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందని, ఉద్యోగాలు సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సీనియర్‌ ఐఏఎస్‌ బుర్రా వెంకటేశంను ఛైర్మన్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్​గా మూడేళ్ల సర్వీసు ఉన్నా ఓప్పించి ఆయనను నియమించినట్లు సీఎం తెలిపారు. గతంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ను, తహసీల్దార్‌లను టీజీపీఎస్‌సీ సభ్యులుగా నియమించి రాజకీయ పునరావాస కేంద్రంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్​ను మార్చారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు.

'రైతు భరోసా'పై సీఎం రేవంత్ గుడ్​న్యూస్ - సంక్రాంతి తర్వాత అన్నదాతల ఖాతాల్లోకి సొమ్ము

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కించుకోవాలి : సీఎం రేవంత్ ఆదేశం

Last Updated : 10 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.